ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
అవశ్యంగా ఆ శక్తి వారిన నుగ్రహించి తీరుతుంది. మధురమైన పదార్ధ మనుభవానికి వచ్చినట్టనే అనుకోరాదు. భక్ష్య భోజ్యాదులు మనం తయారు చేస్తే తయారయ్యేవి. లేదా తయారైనవి అంగడి నుంచి తెచ్చుకొని భుజించేవి. ఇక్కడ అలాంటి వ్యవహారం కాదు. ఆ శక్తి సర్వతో వ్యాపిని. సర్వ వస్వాత్మిక. దానినెవరూ తయారు చేయనక్కరలేదు. ఎక్కడి నుంచీ తే నక్కరలేదు. అంతకు పూర్వమే మన దగ్గరే మన స్వరూపంగానే ఉన్నదది. కేవలం దానిని మరుగు పుచ్చిన ఈ మూడు దోషాలను దూరం చేయగలిగితే చాలు. మన కభిన్నంగానే అది మన అనుభవానికి రాగలదు. ఈ ప్రత్యభిజ్ఞానమూ లేదా గుర్తించటమే శిష్టులమైన మనబోటి వారంతా చేయవలసిన సాధన.
15. సంహృతాశేష పాషండా
16. సదాచార ప్రవర్తికా
వాస్తవమే. కాని దుష్టులుకూడా శిష్టులలాగే సృష్టి అయిన వారు కదా. అలాంటప్పుడు దుష్టులని వారి నుపేక్షించటం దేనికి. కరుణా మూర్తి అని గదా పేరా జగజ్జననికి. ఏమిటీ పక్షపాతం. దుష్టులను కూడా ఆవిడ శిష్టులలాగా పాలించ వలసిందే అని ప్రశ్న వస్తుంది.
నిజమే. పాలించవలసిందే. సందేహం లేదు. పాలిస్తున్నది కూడా అసలు. ఎలాగంటే సంహృతా సేష పాషండ ఆవిడ. అవైదికములై పురుషార్థానికి మనలను దూరంచేసే చార్వాకాది మతాలు చాలా ఉన్నాయి లోకంలో. వాటికి పాషండ మతాలని పేరు. అలాంటి వాటిని నిశ్శేషంగా నిర్మూలిస్తుందా దేవి. అందుకే ఆ దేవికీ పేరు వచ్చింది.
Page 84