ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
ఎండమావుల స్థానంలో సూర్యా లోకంలాగా జగత్తు స్థానంలో సర్వత్రా ఆ చిదాలోకమే దర్శనమిస్తుంది.
12. విద్యావిద్యా స్వరూపిణీ
దీనినిబట్టి మానవులందరికీ మిథ్యా దృష్టి సత్య దృష్టి అని రెండు దృష్టులు చెప్పుకోవలసి వస్తున్నది. అవి ఇటు వ్యవహారలో అటు పరమార్ధంలో కూడా కనిపిస్తాయి. వ్యవహారంలోకూడా ఇది ఇలాంటిదని గ్రహించనంత వరకూ అది మిథ్యా దృష్టి. అలాగే ఇది నేను ఇంతకు ముందు అనుకొన్నలాంటిది కాదు ఇలాంటి స్వభావం కలదని ఎప్పుడు గ్రహిస్తామో అది సత్య దృష్టి, ఈ సత్య మిథ్యా దృష్టులకే విద్యావిద్యలని మారు పేరు. ఇందులో సత్య దృష్టి విద్య. మిథ్యా దృష్టి అవిద్య. కాగా పరమార్థ విషయంలో విద్య కూడా వస్తుతః అవిద్యే. ఋగ్వేదం మొదలుకొని అన్ని విద్యలకూ అవిద్యలేనని నామకరణం చేసింది ముండకోపనిషత్తు. మరి విద్య ఎదని అడిగితే యయాతదక్షర మధిగమ్యతే. దేని ద్వారా అక్షరమైన తత్త్వాన్ని అందుకోగలమో అది అని వర్ణించి చెప్పింది.
ప్రస్తుతం విద్యావిద్యా స్వరూపిణి అని ఆ దేవిని వర్ణింస్తున్నదీ నామం. చిదేక రసరూపిణి అయిన ఆ దేవి విద్యా స్వరూపిణే కావాలిగాని అవిద్యా స్వరూపిణి ఎలా అయింది. అంతే గాక విమర్శ రూపిణీ విద్యా అని సహస్ర నామాలలో ఇతరత్రా విద్యా రూపిణిగానే కీర్తించ బడుతున్న దావిడ. అవిద్యా రూపిణిగా ఎక్కడా చెప్పబడలేదు. అలంటప్పుడీ నామానికి అర్థ మేమిటి.
దీనికి సమాధాన మేమంటే విద్యావిద్య లనేవి ఆ దేవతవి కావు. మనకు చెందినవవి. విద్యా దృష్టితో మనం చూస్తే ఆ దేవత
Page 80