#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

  తొలగితే చాలు. బయటబడి కనిపిస్తుంది తత్త్వం. చీకట్లో ఉన్న ఘట పటాదులు వెలుగుతో చీకటి తొలగితే ప్రకాశించి నట్టని భావించాలి మనం. కనుకనే దుర్లభ అయి కూడా సులభే మరలా ఆ దేవత. దుర్లభ బహిర్దృష్టికి సులభ అంతర్దృష్టికి.

  ఇక్కడ బహిరంతరాలంటే మనస్సుకు వెలపలా మనస్సుకు లోపలా అని భావించరాదు. మనసు లోపల కూడా పుత్ర కళత్రాది భావాలు ఉదయిస్తున్నంత వరకూ అది బహిర్ముఖత్వమే. అలాగే బాహ్యంగా కూడా నామ రూపాలను వదిలేసి వాటి అస్తిత్వాన్ని మాత్రమే గుర్తిస్తున్నంత వరకూ అది అంతర్ముఖత్వమే. అంటే ఎమన్నమాట. సచ్చిద్రూపమైన అధిష్ఠానానికి విముఖులమై మెలగటమే మానవుల బహిర్ముఖత- నామ రూపాది విశేష దృష్టికి స్వస్తి చెప్పి కేవల సత్తా మాత్ర దర్శనమే అంతర్ముఖత అని గుర్తించాలి మనం.

11. మిథ్యా జగ దధిష్టానా

  ఇప్పుడీ అంతర్ముఖ దృష్టిని మానవుడెలా అభ్యసించాలని ప్రశ్న. మిథ్యా జగదధిష్ఠానా అని దీనికి సమాధానం. ఈ భావంతో ఆ దేవిని నిత్యమూ మనసులో భావిస్తూపోవాలి. ఆ మహా శక్తే సమస్తమైన జత్తుకూ అధిష్ఠానం. అంటే ఆధార పీఠం. పీఠం కనపడటం లేదు మన దృష్టికి. దాని మీద ఆరోపితమైన చిత్ర విచిత్ర ప్రపంచమే గోచరిస్తున్నది. ఇది ఎంత వరకిలా భాసిస్తుంటుందో ఈ జగత్తు- అంతవరకూ అక్కడే ఉన్న ఆ అదిష్టానం దీని చేత ఆచ్ఛాదితమై బయటపడదు. కేవలమూ ఆరోపిత రూపంగానే అది మనకు భాసిస్తుంది. భాసిస్తున్న ఈ

Page 78

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు