#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

9. బహిర్ముఖ సుదుర్లభా
10. అంతర్ముఖ సమారాధ్యా

  ముక్తి అనేది కరతలామలకంలాగా అప్రయత్నంగానే సిద్ధిస్తుందని పేర్కొన్నాము. అది కూడా ఆత్మ జ్ఞానమే గాని మరేదీ కాదు. ఈ ఆత్మ అనేది అహం ప్రత్యయరూపమే గదా. అది మానవులందరికీ ఆజన్మ సిద్ధమే. ప్రసిద్ధమే. కారణమేమంటే నేను అని తన్ను తాను భావించని వాడు ఎవడూ లేడు. ఆత్మ ఇంత ప్రసిద్ధమైనప్పుడు తద్విషయమైన జ్ఞానానికి మాత్రం మనమెందుకు గాను ప్రయత్నించాలి. జ్ఞాన స్వరూపమే గదా ఆత్మ అంటే. ఈ జ్ఞానం మనకిప్పుడు ఉండనే ఉన్నది. అలాంటప్పుడు ప్రయత్నం దేనికని ఆక్షేపణ.

  దీనికి సమాధానమే బహిర్ముఖ సుదుర్లభా. లబ్ధుమశక్యా Aదుర్లభా. సుష్ట దుర్లభా సుదుర్లభా. ఎప్పటికీ పొందటానికి సాధ్యం కానిదని అర్ధం. ఆ దేవీ తత్త్వాన్ని అందుకొనే ఆశ మనకెప్పటికీ లేదు. అలాంటి అతీతమైనదా తత్త్వం. జ్ఞానమే అతీతమైనప్పుడు ముక్తి ఇక ఎలా సంభవం. కానీ ఆ దేవత సర్వ వ్యాపినీ ప్రసిద్ధా అని ఇంతకు పూర్వం చాలా మార్లు వర్ణించారు గదా అంటే అలా వర్ణించినప్పటికీ ఆవిడ దర్శనం దుర్లభమేనట. కారణమేమని అడిగితే ఎదోకాదది మానవుల బహిర్ముఖత్వమే.

  మానవులందరూ నూటికి తొంభైతొమ్మిది మంది హెర్ముఖులై బ్రతుకుతుంటారు. మనం బహిర్ముఖులం కావటం మూలాన్నే ఆవిడ సర్వ వ్యాపినీ సుప్రసిద్ధా అయి కూడా మనకు దుర్లభ అయి పోయింది. బహిర్ముఖత్వ మేమిటని అడగవచ్చు. దానికభిముఖంగా లేక పోవటమే బహిర్ముఖత్వం. పదార్థం మన

Page 76

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు