ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
మందుకోవలసిందే. తప్పదు. అప్పుడే అది ఫల ప్రదమౌతుంది వారికి. దేవ కార్య సముద్యత అయిన ఆ దేవి ప్రయత్నం కూడా సఫలమౌతుంది.
5. శాస్త్ర సారా
గురువులైన వారు తమ శిష్యులకెలా బోధిస్తారు- వారినెలా ఉద్దరిస్తారు- అని అడిగితే దానికి సమాధానమీ నామం. బోధ అనేది నిరంకుశంగా చేయడే గురువుగాని దానికొక ప్రమాణముండి తీరాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అని చాటుతున్నది గీత. శాస్త్రమే దేనికైనా ప్రమాణం. జ్ఞాన సాధనమే కదా ప్రమాణమంటే ప్రమాణం లేకుండా ప్రమేయం తాలూకు జ్ఞానమెప్పుడూ సిద్దించదు. ప్రమేయమిక్కడ సర్వాత్మ భావం. అది శాస్త్ర ప్రమాణం చేతనే తప్ప ప్రత్యక్షానుమానాలతో సిద్ధించేది కాదు. అవి రెండూ అనాత్మ ప్రపంచానికి చెందినవే గాని ఆత్మకు చెందనవి కావు. కనుక శాస్త్రానికి మాత్రమే ఇక్కడ ప్రవేశం.
శాస్త్రానికి మాత్రం ఆత్మ ఎలా విషయమౌతుంది. సర్వ ప్రమాణాలకూ అది అవిషయమని కదా చెప్పారు. కనుకనే గదా అప్రమేయమని దానికి పేరు వచ్చింది. వాస్తవమే. ప్రమాణానికి విషయం కాదాత్మ. శాస్త్రంకూడా దాన్ని విషయంగా చూరుడు. దానికేవేవి విషయాలౌతున్నవో వాటన్నిటినీ కాదని త్రోసి పుచ్పురూ దాని జ్ఞానం మనకందిస్తుంది. శాస్త్ర సారమంతా ఇదే. ఇలా నిషేధముఖంగా ప్రమాణమౌతుంది శాస్త్రం. విధి ముఖంగా కాదు. కనుకనే ప్రమాణమని చెప్పినా పొరబాటు లేదు. ఇంతకూ ఆగమరూపమైన శాస్త్రం వల్లనే మనకాత్మ జ్ఞానం కలుగుతుంది.
Page 71