#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

జిజ్ఞాసుల కందివ్వటం కోసమింత దూరం శివ దూతి అయి కదలి వచ్చింది.

4. గురు మూర్తిః

  కావచ్చు. దూతిక లాగా దిగి వచ్చిందని భావించటాని కేమిటి నిదర్శనం. ఎలా గ్రహించవలసి ఉంటుంది మనం. గురు మూర్తి అనే మాట దానికి సమాధానం. గురు మూర్తి అని దేవికి పేరు. ఆ దేవి ఎప్పుడూ తన రూపంతో తాను మనకు సాక్షాత్కరించదు. శక్తి రూపిణి కదా ఆవిడ. ఎలా సాక్షాత్కరించ గలదు. శక్తి ఎప్పుడూ గోచరించదు గదా. కనుక ఒకానొక సద్గురువు రూపంలోనే మనకావిడ దర్శనమిస్తుంది. లోకంలో తత్త్వ దర్శనులైన ఆచార్య పురుషు లెవరున్నారో - వారందరూ దేవీ స్వరూపులే. దేవికీ వారికీ భేదం లేదు. ఆ మహా దేవే మన ఈ దేవ కార్యాన్ని సాధించటానికి ఆయా సద్గురువుల రూపాన్ని ధరించి మనకు ప్రత్యక్షమౌతున్నది. గురు స్సాక్షాత్ పరం బ్రహ్మ అనే సుభాషితంలోని అంతరార్ధమిదే. గురువుకూ దేవతకూ తేడా లేదని చెప్పటమే.

  నిరాకార అయిన దేవి గురువనే పేరుతో సాకార అయి మనకు కనిపిస్తున్నది. ఎవరెవరు బ్రహ్మ విద్య నర్దిస్తున్నారో వారికా విద్య నుపదేసిస్తున్నది. ఉపదేశించి క్రమంగా వారినీ సంసార సాగరం నుంచి తరింప జేస్తున్నది. అంతే వాసులైన ఈ జిజ్ఞాసువులకు కూడా అలంటి సద్గురువులను సేవించటం ధర్మం. తద్వి జ్ఞానార్ధం స గురుమేవాభి గచ్ఛేత్ అని ఉపనిషత్తు చెప్పనే చెప్పింది. ఎమిటి దీనికర్ధం. బ్రహ్మ విజ్ఞానార్ధి అయిన ప్రతి ఒక్కడూ గురూప సదనం చేయవలసిందే. నిత్యమూ వారినా శ్రయించి తదను గ్రహంతో విజ్ఞాన

Page 70

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు