ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
వారి నుపేక్షించదు. జ్ఞాన సముపార్జన కోసం ఎంతెంత వారు ప్రయత్నిస్తే అంతంత దాని ననుగ్రహిస్తుంది. మరి జ్ఞానులే అయి తన సాక్షాత్కారమే కోరితే నిజ స్వరూపంతో వారికి సాక్షాత్కరిస్తుంది.
3. శివ దూతీ
అసలందు కోసమే శివ కామేశ్వరాంకస్థ అయి కూడా ఆవిడ అక్కడే కూచోక తన స్థానం వదిలేసి ఆ పరమ శివుడు పంపిన ఒక దూతిక లాగా దివి నుంచి భువికి దిగి వచ్చింది. పరిత్రాణాయ సాధూనాం అని గదా భగవానుడి మాట. దైవ గుణ సంపన్నులైన ముముక్షువులందరూ సాధువులే వారిని తరింప జేయటమే ఆవిడ కర్తవ్యం. అందుకే అంత దూరం నుంచి మన దగ్గరికి ఆవిడ దిగి రావటం. శివ దూతి అనే పేరు కూడా అంచేతనే ఆవిడకు సార్ధకమౌతున్నది.
ఒక దూతి చేసే కృత్యానికి దౌత్యమని పేరు. అది ఎదో కాదు. ఒకరు చెప్పి పంపిన సందేశం మరొకరికి అంద జేయటమే. సందేశ ప్రేషకు డిక్కడ శుద్ధ చైతన్య రూపుడైన పరమాత్మ. చిన్మాత్ర రూపుడు కనుక ఆయన కూటస్థుడు. కదలలేడు. కదిలి ఎక్కడికీ రాలేడు. పోతే ఆయన క్రియా శక్తి ఈ పరా దేవత. క్రియా రూపిణి గనుకనే నిమిష మాత్రంలో ఎక్కడికైనా పయనించ గలదు. భాను మండల మాకాశంలో కదలకుండా ఒక చోట ఉన్నప్పటికీ దాని దీప్తి మండలం నుంచి బయలు వెడలి దశ దిశలా వ్యాపించటం లేదా. అలాగే ఆ దేవి కూడా సర్వ వ్యాపిని. వ్యాపిని గనుకనే ఆ దేవుని సందేశం లాంటి సర్వాత్మ విజ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకొని అది ఈ
Page 69