#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

  అందుకే ఆవిడ అనుగ్రహం కూడా మన పాలిటికి ఆగ్రహమై పరిణమించింది జన్మ జన్మల నుంచీ. ఎవరైతే అలా విస్మరించరో-తమకు వరప్రసాదిని అయిన ఆవిడను ఎప్పుడూ స్మరిస్తుంటారో-తద్దర్శనం కోసం ఎకరుతుంటారో - అలాంటి వారావిడ అనుగ్రహాని కెప్పుడూ పాత్రులే. కరుణామృత ధారలలో నిత్యమూ అభిషిక్తులే. అట్టి వారికావిడ మోహిని కాదు. అనుగ్రాహిణి. తత్వజ్ఞులు కాబట్టి వారి మీద మోహాంధకారం పని చేయదు. జ్ఞాన ప్రకాశంలో నామ రూపాలు మరుగు పడి ఆవిడ సచ్చిత్ స్వరూపమే నిత్యమూ దర్శన మిస్తుంది. ఉత్తర గోగ్రహణంలో అందరూ ఒడలు తెలియక పడిపోయినా- మెళకువతో ఉండి చూచే భీష్మ ద్రోణులలాంటి వారు వారు.

2. దేవ కార్య సముద్యతా

  దేవీ కారుణ్యానికి నోచుకొన్న పుణ్య పురుషు లెలాంటి వారని అడిగితే చెబుతున్నదీ నామం. దేవా అంటే స్వర్గ వాసులైన దేవతలని కాదు. దైవ గుణ సంపన్నులైన మానవులే ఇక్కడ దేవతలు. స్వర్గ వాసులైకూడా దుశ్చరిత్రులైతే దేవీ ప్రసాదానికి పాత్రులే కారు. కనుక మనుష్యులలోనే శమదమాదులూ శ్రద్ధాదులూ అమానిత్వాదులూ మొదలైన సద్గుణాలలవడిన వారందరూ నిజానికి దేవతలే.

  అలాంటి దేవతల కార్య మేదో అదే దేవ కార్యం. దేవీ స్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరికే అది తెలుసుకొని ఈ భవ సాగరం నుంచి బయటపడాలనే వారి తాపత్రయం. అంచేత సంసార తరణమనే తత్ కార్యాన్ని సాధించటానికే సముద్యతా. ఎప్పుడూ బద్ద కంకణ అయి ఉంటుందా దేవి. ఎప్పుడూ అలాంటి

Page 68

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు