పూర్వార్ధము - అవరోహణ క్రమము
మానవ జన్మ ఎత్తి కూడా పశువులలాగా నిరర్ధకమైన జీవితం గడుపుతున్నారు. సంసార తరణోపాయంమేమిటో దాని కోసం ఈషణ్మాత్రం కూడా ప్రయత్నించటం లేదు. ఇలాంటి పశుప్రాయులైన మానవులందరినీ ఆ మహామాయ అంతకంతకూ మోహ సాగరంలోనే ముంచి వేస్తుంది. సర్వ జగన్మోహిని కదా ఆ మహా శక్తి. మోహింప జేయటంలో ఆశ్చర్యమేముంది. అజ్ఞానుల కెప్పుడూ ఆవిడ మోహినే. నూటికి తొంభైతొమ్మిది మంది అజ్ఞానులే లోకంలో. కనుకనే సర్వ మోహినీ అనే పేరు సార్ధక మావిడకు.
Page 62