పూర్వార్ధము - అవరోహణ క్రమము
అదే గుర్తించ గలదు. ఇలాటి సంవేదన ఒక్కటే గానీ రెండు మూడు అనే ప్రసక్తి లేదు. అనుభవమనేది ఎక్కడే గాని ఏకరూపమే. జ్ఞానమే అనుభవం. ఏ జ్ఞానమైనా అది జ్ఞానమే. అలాగే 'ఏ అనుభవమైనా అనుభవమే. నేననే అనుభవమెలాంటిదో నేను గ్రహించే ప్రపంచానుభవం గూడా అలాంటిడే గనుక రెండూ కలిసి ఒకే అనుభవమని మనం గ్రహించ వలసి ఉంది.
49. ఆబాల గోప విదితా
అంతా ఆత్మ స్వరూపమేనని చెప్పాము. ఆత్మ అంటే ఎమిటోకూడా నిర్వచించాము. పోతే ఈ ఆత్మ అనేది ఎవరికీ అందకుండా ఎక్కడో పరోక్షంగా ఉన్న పదార్థం కాదు. ఆ మాటకు వస్తే ఆబాల గోపాలమూ సర్వులకూ విదితమే. అనుభవ సిద్ధమే. బాల అంటే అత్యంత మూఢుడు. మరి గోప అంటె రాజనే గాక సకల శాస్త్రజ్ఞుడైన పండితుడని కూడా అర్ధమే. మూఢుడు ప్రౌఢుడు- వీరిద్దరినీ ఉదాహరించటాన్ని బట్టి మిగతా లోకుల సంగతి వేరుగా చెప్ప బని లేదు. అందరూ వీరిద్దరి మధ్య ఉన్న అంతస్థులలోనే చేరిపోతారు. వీరూ వారని హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ ఆత్మ అంటే ఎమిటో విదితమైన విషయమే.
అందరికీ విదితమేనని ఎలా చెప్ప గలం. నీవెవరినైనా అడగి చూడు. ఎవడవు నీవని అడిగితే ఎమి చెబుతాడు జవాబు. నేనేనంటాడు. నేనుకానని తన్ను తాను దూరం చేసుకొని మాటాడడు. ఆత్మ అనే భావమే మనసులో లేకుంటే నేను అనే మాట వాడి నోట రాదు. ఈ నేననే స్ఫురణే ఆత్మ అనే మాటకర్ధం. కాబట్టి ఒక బాలుడేమిటి. గోపాలుడేమిటి. ఇది
Page 57