#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

మానవుడెప్పుడు తన్ను గుర్తిస్తాడా అని ప్రతీక్షిస్తుంటుంది. ఈ ప్రతీక్షించే దేవీ గృహం కూడా మన ఈ శరీరంలోనే ఉంది. అదే చింతామణి గృహం. గృహం లాంటిది గనుకనే ఇది గృహ మయింది. అది మన బుద్దే. దీనిలో ఎన్నో మణులు కూడా పోగై ఉన్నాయి. అవే చింతామణులు. చింతలంటే బుద్ధి వృత్తులు. మన ఆలోచనలే. అవే మణుల లాగా ఒకదానికొకటి చేరి బుద్ధి విజ్ఞానంగా పరిణమిస్తున్నాయి. సముద్ర తరంగాల లాంటివివి. సముద్రం మన బుద్ధి అయితే తరంగాలీ ఆలోచనలు. ఇవే మాటిమాటికి ఆవృత్తమవుతూ వాసనలను పుట్టిస్తాయి. అవి కదంబ వాసనల లాగే మన ఈ శరీర వృక్షాన్ని వదలి పోవు. ఈ మొత్తాన్ని కొనా మొదలు వ్యాపించి ఉన్నదా దేవి. ఆవిడే సుమేరు శృంగం. ఆవిడే శృంగ మధ్యస్థ. ఆవిడే చింతామణి గృహం. ఆవిడే తదంతస్థ. ఆ దేవత స్వరూపాన్ని కాదని ఇందులో ఏ ఒక్కటి మనదంటూ లేదు.

47. జ్ఞాన విగ్రహా
48. ఆత్మా

  మనదేదీ లేదు. అంతా ఆ దేవతే వ్యాపించి ఉందని చెప్పుకొన్నాము. అంతా అంటే త్వగింద్రియం నుంచి సహస్రారం వరకు ఈ సంఘాతమంతా అని అర్థం. దీనినే విగ్రహమని కూడా పేర్కొన వచ్చు. ఈ విగ్రహం మనకిప్పుడు జ్ఞయంగా కనిపిస్తున్నది. జ్ఞయమంటే జ్ఞానానికి విషయం. నిజానికి జ్ఞాన విషయం కాదిది. జ్ఞాన స్వరూపమే. అంతా దేవతా స్వరూపమే నన్నప్పుడు అది జ్ఞానమే కావాలి గాని జ్ఞాన విషయమెలా కాగలదు. జ్ఞాన స్వరూపిణే గదా దేవి. ఆవిడ కేదైనా ఒక విగ్రహ ముందంటే అది జ్ఞానమే. విగ్రహం కాని విగ్రహమది. నిరాకారమైనది జ్ఞానం. అలాంటి జ్ఞాన

Page 55

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు