#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

37. కులరూపిణీ

  ఇప్పుడీ కదంబవనమనేది ప్రాణులనెలా పరివేష్టించి ఉందో -వారినెలా విడిచి పోదో- వివరిస్తున్న దీనామం. కులరూపిణీ. కులమంటే పాంచభౌతికమైన ఈ శరీరం. పృథివ్యాధులైన పంచభూతాల తామస రాజసాంశములతో తయారయిందిది. మససు కూడా సాత్వికాంశతో తయారయినదే. ఇలాగా ఈ శరీరం ప్రకృతి గుణాలతో ఏర్పడటం మూలంగా దీన్ని సంఘాతమని వేదాంతులు- కులమని తాంత్రికులు పేర్కొంటారు.

  ఏదైనా కావచ్చు. సర్వధా ఇది ప్రకృతి జన్యం. ప్రకృతి కధీనం. ఇందులో ప్రవేశించాడని చెప్పే జీవుడే దానికధీనం కాడు. చిన్మాత్ర స్వరూపుడు జీవుడంటే. అతడు జడప్రకృతికి ఎలా వశపడుతాడు. కాని తాను చిన్మాత్రుడనని అతడు తన స్వరూపాన్ని గుర్తించటం లేదు. పైగా అనాది వాసనా బలంతో శరీరం మేరకే తన స్వరూపాన్ని దించుకొని చూస్తున్నాడు. ఇదిగో ఈ అభిమానమే జీవుణ్ణి ఈశ్వరుడికి దూరం చేస్తున్నది. ఆ ఈశ్వర శక్తే కులరూపిణి అయి ఒక కులాయం లాంటి ఈ కులంలో పక్షి లాంటి ఈ జీవుణ్ణి తెచ్చి పడవేసింది.

38. త్వ
38. రుధిర సంస్థితా
40. మాంస నిషా
41. మేదో నిషా
42. అస్థి సంస్థితా
43. మజ్జా సంస్థా
44. శుక్ర సంస్థితా

  పడవేసి ఊరక కూచోలేదు. సప్త ధాతువుల రూపాలు ధరించి వాటితో ఈ జీవుణ్ణి గట్టిగా చుట్టి వేసింది. త్వగసృఙ్మంస మేదోస్థి మజ్జా శుక్రాలని ఇవి సప్త ధాతువులు. ఇవి ఏడూ ఏడు

Page 52

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు