#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

పోతున్నాడు. అది భ్రమిస్తుంటే దానితో పాటు తాను పరిభ్రమిస్తూ ఒక జన్మ నుంచి మరొక జన్మ లోనికి వచ్చి పడుతున్నాడు.

  ఇక్కడ కూడా జీవుడు కాదు ఈ సంసారమూ కాదు పరిభ్రమించటం వాస్తవంలో. ఈ భవ చక్రానికి ప్రవర్తని ఆ పరా శక్తే. ఆవిడే ప్రవర్తింప జేస్తున్నది. ప్రవర్తిస్తున్నది. రెండు విధాలా ఈ నాటకం అభినయిస్తున్నదావిడే. జగదాత్మిక గనుక భవ చక్ర రూపంగా ప్రవర్తిస్తున్నది. జగన్నియామిక గనుక ఈ భవ చక్రాన్ని ప్రవర్తింప జేస్తున్నది. మొదటి అర్ధంలో ప్రవర్తినీ అని - రెండవ అర్థంలో ప్రవర్తనీ అని చెప్పుకోవాలి ఈ నామాన్ని. కనుక యధార్థంలో భవచక్రమనేదొకటి ఎక్కడా లేదు. ఉన్నదంతా దేవీ స్వరూపమే. దానినలాగే చూడలేక ఈ జీవుడు ఆ దేవతనే భవచక్ర రూపిణిగా దర్శిస్తున్నాడు. దర్శిస్తుంటే వీడి దృష్టిననుసరించి ఆ దేవి కూడా తన స్వరూపాన్ని మభ్య పెట్టి ఈ సంసార రూపంగానే వీడికి దర్శనమిస్తున్నది.

35. సుధాసాగర మధ్యస్థా
36. కదంబ వన వాసినీ

  ఎలా దర్శనమిస్తున్నది. ఎక్కడ ఇస్తున్నదీ. సుధాసాగరమధ్యస్థ అయి దర్శనమిస్తున్నది. సుధాసాగరం మన చుట్టూ కనిపించే ఈ సంసార మండలమే. సుష్ఠు ధీయతే పీయతే ఇతి సుధా. చక్కగా ఆస్వాదించే దేదో అది సుధా. అంటే అమృతమని అర్థం. పంచేంద్రియాలతోనూ అంతరింద్రియమైన మనసుతోనూ తనివి దీర ఆస్వాదిస్తున్నామీ సంసారాన్ని మనం. కనుకనే దీనిని అమృతంతో పోల్చి చెప్పారు. అమృత రసం లాగా మనకిది ఆస్వాదయోగ్యమయి కనిపిస్తున్నా నిజానికిది సాగరమే.

Page 50

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు