#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

కాకుంటే సృష్టించటమనేది అసంభవం. స్పుటన చెందిన ఆ దశే బ్రహ్మ రూపా. బ్రహ్మ రూపా అని పేరేక్కొనటం వల్ల ఆ శక్తి తానే బ్రహ్మ అయి సృజిస్తున్నదని ధ్వనిస్తుంది. అంటే శక్తికి భిన్నంగా బ్రహ్మదేవుడొకడు వేరే లేడని భావం. పరా శక్తే బ్రహ్మ అనే రూపంలో మలుపు తిరిగి కనిపిస్తున్నది. సువర్ణమే మలుపు తిరిగి కటక కుండలాది రూపాలలో కనిపించినట్టు. కనుక స్పుటిత అని పేర్కొన్నా అది వాస్తవంలో అస్పుటితమే. స్పుటితమయి కనిపించటం కేవలమొక ఆభాస. అంతేకాదు. ఇక్కడ బ్రహ్మ రూపా అనటంలో ఉపాదానమూ సృష్టి కర్రీ అనటంలో నిమిత్తమూ రెండు ఆ శక్తే అవుతున్నదని మరలా వర్ణించినట్టయింది. దీని మూలంగా సృష్టి ఆవిడే సృష్టి కర్రి ఆవిడే. ఆ పరా శక్తికి వ్యతిరిక్తంగా 'ఎది చూడరాదని కూడా సాధకుణ్ణి హెచ్చరించినట్టయింది.

  సృష్టి ఎలాగో స్థితి కూడా అలాగే శక్తి కర్తృకం శక్త్యాత్మకమే నని గ్రహించాలి మనం. గోస్త్రీ గోవింద రూపిణీ అని ప్రపంచ స్థితిని వర్ణిస్తున్నది నామం గోవింద రూపాన్ని ధరించి జగత్తును గోపనం అంటే పాలనం చేస్తున్నదట. గో అంటే అనేకర్ధాలున్నాయి. ఇంద్రియ జ్ఞాన వృత్తులకు కూడా గో అనే పేరు. వాటితో వ్యవహరించే దేవత ఏదో అది గోవింద రూపిణి. దీని మూలంగా జగద్వ్యవహార రూపమైన స్థితి ధ్వనిస్తున్నది. ఇక్కడా ముందు వర్ణించినట్టు గోవిందుడనే వేషం వేసుకొని జగత్ స్థితి రూపంగా కనిపిస్తున్నదీ - దీన్ని నియమిస్తున్నదీ సూచిస్తున్నదీ నామం. ఆ దేవేనని

Page 45

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు