#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

వ్యాపారాలివి. అలా కాకుంటే రాగద్వేష దూషిత కావలసి వస్తుంది ఆ పరా శక్తి. అది ఆవిడ నిరంజనత్వానికి భంగకర మవుతుంది.

  ఇక్కడ పంచకృత్యములని పరిగణించినప్పటికీ వస్తుతః అవి పంచ కృత్యాలు కావు. ఆ మాటకు వస్తే రెండే ఆ దేవి నిర్వహించే కృత్యాలు. సృష్టి స్థితి లయాలని వర్ణించిన మొదటి మూడూ తిరోధానమనే నాలుగవ దానిలోనే చేరిపోతాయి. తిరోధాన శక్తికి అదనంగా ఆ మూడు వ్యాపారాలూ కానరావు. ఎందుకంటే పరిపూర్ణమయిన శివచైతన్యం తిరోహితం కావటం మూలాన్నే ప్రపంచ సృష్టి స్థితి సంహారాలు ఏర్పడినట్టు జీవుడికి భాసిస్తున్నది. ఇలాంటి తిరోధానమే లేకుంటే ఏదీ నిర్మాణమూ కాదు. నిలవనూ నిలవదు. మరలా లయమయ్యే ప్రసక్తీ లేదు. పరిశుద్ధమూ పరిపూర్ణమూ అయిన ఆ చైతన్యం అలాగే చెక్కు చెదరకుండా ఉండి పోగలదు. అది సృష్టి స్థితి అంటూ మరొక లాగా మారటమనేదే ఉండబోదు.

25. సృష్టి కర్రీ - బ్రహ్మ రూపా
26. గోస్త్రీ గోవింద రూపిణీ
27. సంహారిణీ - రుద్ర రూపా
28. తిరోధాన కరీ - ఈశ్వరీ
29. సదాశివా - అనుగ్రహదా

  ప్రస్తుతమా సృష్ట్యాదులైన పంచకృత్యాలనూ - వాటినాదేవి ఎలా నిర్వర్తిస్తుందో ఆ విధానాన్నీ సవిస్తరంగా నిరూపిస్తున్నదీనామావళి. మొదట బ్రహ్మ అనే రూపాన్ని ధరించి ఈ చరాచర జగత్తునూ సృష్టిస్తున్న దాదేవి. బృహధాతువు నుంచి ఏర్పడింది బ్రహ్మ అనే శబ్దం. ఆ ధాతువుకు స్పోటనమని అర్థం. స్పు టితమయ్యే ఆ శక్తి ఈ ప్రపంచాన్ని కల్పించింది. స్ఫుటితం

Page 44

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు