#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

నిర్విచారమైన భావమేర్పడాలి ఈ జీవుడికి. అప్పుడే ఈ సంసార. బంధం నుంచి విముక్తుడు కాగలడు.

22. చరాచర జగన్నాధా

  కాని ఇలాంటి మహా భాగ్యం మనకింకా కలగటం లేదంటే ఆశ్చర్యం. సర్వ ప్రపంచమూ పర నుంచి వైఖరి వరకూ - శివ నుంచి క్షితి వరకూ- అంతా దేవీ మయమయి కూడా మనకలా భాసించక పోవటం ఎంత దురదృష్టం. ఆవిడే జగదాత్మికా ఆవిడే జగన్నియామికా - మనదేమీ లేదు- అనే ఉదాసీన బుద్ధి మనకేమాత్రమూ కలగటం లేదు. మీదు మిక్కిలి మనమే కర్తలం-మనమే భోక్తలమని భావిస్తూ అలాగే ప్రవర్తిస్తున్నాము. నిజంలో కర్తలమూ కాము భోక్తలమూ కాము మనం. ఆ దేవియే సర్వ కర్రి. ఆవిడే సర్వ ఫల భోక్తి. ఎందుకంటే చరాచర జగన్నాథ ఆవిడ. చరాచరాలంటే చేతనాచేతనాలు. వీటన్నిటికీ ఆవిడ నాథ. నాస్తి అథ అనంతరం యస్యాః సా నాథా. ఏది తప్ప విడిచి మరి ఒక శరణ్యమంటూ లేదో దానికి నాథ అని పేరు. జీవులందరికీ ఏకైకమయిన శరణ్యం ఆ పరాశక్తే. ఆవిడ వివర్తమే గదా ఈ చరాచర జగత్తు. అంచేత ఆ శక్తే సర్వస్వమని దానికర్తృత్వాన్నే సర్వ వ్యవహారాలలోనూ దర్శించాలి మనం. భోక్తృత్వం గూడా ఆ శక్తిదేనని భావించాలి. మధ్యలో మనం మన బుద్ధులతో ప్రవేశించరాదు. ఆ చైతన్య రసం చేతనే గదా అనువిద్ధమై ఉన్నాయి మన బుద్ధులు కూడా

Page 41

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు