#


Index

ముఖావలోకనము

మధ్యమ అని పేరు గాంచింది. ఆ మధ్యమే సూక్ష్మరూపాన్ని వదలి ఆకాశాది స్థూలరూపంగా ఎప్పుడు ఆవిర్భవించిందో అప్పుడది వైఖరి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ నాలుగవదైన వైఖరీ రూపమే ఇప్పుడు మన అందరి దృష్టికీ కనిపిస్తూ ఉంది. కేవలమూ బ్రహ్మాండరూపంగా మనవెలపలే గాదు. పిండరూపంగా మన లోపల కూడా చేరిపోయింది. ఇందులో పరఅనేది ఒక్కటీ తప్ప విడిస్తే తక్కిన దశలు మూడూ ఆశక్తి తాలూకు కార్యరూపాలే. అందులోనూ వైఖరీ రూపమైన నాలుగవది మిగతావాటికన్నా చాలా స్పష్టంగా కనబడుతోంది . ఎప్పుడే గాని కనపడే దాన్ని ఆధారం చేసుకొనే కనపడని దాన్ని వెదకి పట్టుకోవాలంటారు పెద్దలు. కాబట్టి ప్రత్యక్షంగా కనిపించే ఈ వైఖరీ రూపాన్ని ఆలంబనం చేసుకొని ఆ పరమార్థాన్ని అన్వేషించే ప్రయత్నం చేయాలి మనం. ప్రయత్నిస్తే తప్పకుండా ఇది ఆ గమ్యాన్ని మనకు అందించి తీరుతుంది.

  ఈ భావానికి సూచకమైన నామం మరొకటి కూడా ఉంది ఈ నా మావళిలో అది శివజ్ఞాన ప్రదాయినీ అనేది. శివ సంబంధమైన జ్ఞానమేదుందో అది శివజ్ఞానం. అలాటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది గనుక దేవికి శిషన ప్రదాయిని అని పేరు వచ్చింది. ఇప్పుడీ రెండు నామాలూ కలుపుకొని మనం పర్యాలోచన చేస్తే మనకేమని స్ఫురిస్తుందో మీరే చెప్పండి. ఏ పరాశక్తి శివతత్త్వమనే మూలస్థానం నుంచి వైఖరీరూపంగా ఇంత దూరం పరిణమిస్తూ వచ్చిందో ఆ శక్తి మరలా ఆ శివసాయుజ్యం చెందే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుందని గదా అర్థం.

Page 4

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు