#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

కాదు. పూర్తి జడమైతే చైతన్య స్పర్శకోలుపోయి అసలే కనిపించకూడదు మనకు జడమైన పదార్థమేది గాని. ఘటపటాదికమైన పదార్థాలన్నీ మనకు నిత్యమూ భాసిస్తున్నాయి గదా. చైతన్య స్పర్శ ఉండటం మూలాన్నే అలా భాసించ గలుగు తున్నాయని అర్థం చేసుకోవాలి మనం. అయితే చైతన్యమందులో అత్యల్పంగా ఉన్నందువల్ల బయట పడి కనిపించటం లేదు. అంత మాత్రమే.

  అంచేతనే ఇలాంటి జడ పదార్థాల్లో వ్యాపించి ఉన్న శక్తి జడ శక్తి అని పేర్కొనబడుతున్నది. చైతన్యంతో ఓతప్రోతమయి ఉన్నదే ఈ జడశక్తి కూడా. దేవీ భాగవతంలో దేవి మహిషాసురుణ్ణి సంబోధించి చెప్పిన మాట ఈ భావాన్నే బల పరుస్తున్నది. జడాహం తస్య సాన్నిధ్యాత్ ప్రభవామి సచేతనా. నేను స్వతహాగా అచేతననైనా చేతనుడైన పరమాత్మతో నిత్యమూ కలిసి ఉన్నందు వల్ల చిద్రూరిణి నే ఎప్పుడూ. జడ రూపిణిని కాను. అని స్వయంగానే చాటి చెప్పిందాదేవి.

  ఇలాటి జడ శక్తి చేత అది జడాత్మకంగా పరిణమిస్తున్నది. ఇక్కడ కూడా జడ శక్తి అనటంలో నిమిత్త కారణం జడాత్మికా అనటంలో ఉపాధాన కారణం తొంగి చూస్తున్నవి. అప్పటికి లోకంలో ఏయే జడ పదార్థాలు మన కంట పడుతున్నవో అవన్నీ అ జడ శక్తి పరిణమించిన రూపాలే అని గ్రహించాలి మనం. ఆ శక్తే ఘటమని పటమని కుడ్యమని, కవాటమని ఇలాగా ఇన్ని రూపాలలో మారి కనిపిస్తున్నది. ఇంతకు ముందు ఎలాగైతే మనుష్య పశుపక్ష్యాది చేతన రూపాలుగా ఆ చిచ్ఛక్తే మారి కనిపిస్తున్నదని చెప్పామో అలాగే ఇక్కడా ఘటపటాది జడ పదార్థాల

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు