పూర్వార్ధము - అవరోహణ క్రమము
ఉపాధానత్వాన్ని చెబుతున్నది. అది కేవలం శక్తియే కాదు. ఈ కనిపించే జీవుల రూపంగా కూడా అదే పరిణమించిందని భావం. దీనిని బట్టి సమస్త చేతన ప్రపంచమూ చిధాత్మరూపంగా భావన చేయాలని బోధపడుతున్నది.
14. జడ శక్తిః - జడాత్మికా
అది కేవలం చిచ్ఛక్తే కాదు. దానికి భిన్నమైన జడశక్తి కూడా అదే నట. చిదేక రస రూపిణి అని గదా వర్ణించారు దేవిని. అలాంటప్పుడది చిచ్ఛక్తే కావాలి గాని దానికి విరుద్ధమైన జడశక్తి ఎలా కాగలదు. అదే చేతనా అదే జడ అని చెప్పటం పరస్పర విరుద్ధం గదా అని ప్రశ్న వస్తుంది. నిజమే అది ఛిద్రూపిణే ఆ శక్తి. జడ రూపిణి కాదు. అయినప్పటికీ ఆకాశాది భూతాలలో జడంగా భాసిస్తున్నది. శరీరాది పిండరూపాలలో కూడా అలాగే భాసిస్తుంది. అలా భాసిస్తున్నా అది యధార్థంగా జడ కాదు. జడ రూపంగా పరిణమించిన చైతన్య శక్తే.
ఇక్కడ ఒక రహస్యం గుర్తించాలి మనం. వస్తుతః చేతన అయినా ఆ శక్తి చేతనులైన మనుష్యాదులలో ఏ మాత్రమూ మార్పులేకుండా అలా చేతన రూపంగానే కనిపిస్తుంది. కేవలం పరిమాణంలో మాత్రమే హెచ్చు తగ్గులు పొందుతుంటుంది. పరిమాణంలోనే కాని గుణంలో కాదు. పోతే ఆకాశాది జడ పదార్థాల్లో బాగా మార్పు చెంది చైతన్యం మరుగు పడి పైకి అచేతనగా కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పటికీ చైతన్యం అందులో లేదని గాదు అర్థం. పరిణామ క్రమంలో ఏర్పడ్డ విప్ర కర్ష వల్ల అలా దానికి జడత్వమేర్పడినట్టు స్ఫురిస్తున్నది. అంతేగాని పూర్తిగా జడం
Page 32