పూర్వార్ధము - అవరోహణ క్రమము
బోధిస్తున్నదీనామం. చిచ్ఛక్తి అంటే జ్ఞానశక్తికే మారు పేరు. అది చైతన్య రూపం గనుకనే చేతనులైన జీవుల రూపంగా మూరుతున్నది. జరాయుజాదులైన జీవులందరూ చేతన రూపులే. అచేతనులుకారు. మననశక్తి ప్రాణమశక్తి తో కూడుకొని ఉండటమే .. చేతనత్వం. అది ఈ జీవులందరికీ కనిపిస్తూ ఉన్న లక్షణమే.
ఇది చిచ్ఛక్తి వల్ల ఏర్పడినదే ఈ పరిణామం. అనేన జీవేమాత్మనా అను ప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి అని ఆ పరాదేవత సంకల్పించి అలాగే జీవ రూపంగా ప్రవేశించిందట. ఇక్కడ సంకల్పించిందనే అంశంలో అది ఉపాదానకారణమయింది. రెండింటి స్వరూపమూ ఆ చైతన్య శక్తే మరేది గాదు. పోతే లోకంలో ఇలాంటిది గాదు వ్యవహారం. ఏది నిమిత్తమో ఇక్కడ అది ఉపోదానం కాదు. మరి ఉపాదానమయిన మృత్సుసువార్ణాదులు నిమిత్తం గాదు. పరమార్థంలో మాత్రం ఉపాదాన నిమిత్తాలు రెండూ ఒక్కటే కావటం విశేషం. ఒకే శక్తి చిద్రూపంగా నిమిత్తమయి తనకు భిన్నగా మరొక వస్తువు లేదు గనుక అదే ఉపాదానం కూడా అవతున్నది.
అంచేత చేతనా రూపులైన ప్రాణులుగా ఎవరు చెలామణి అవుతున్నారో వారందరూ చిద్విశేషాలుగా కనిపిస్తున్నా నిజానికి చిన్మాత్రులే. ఘటాదులన్నీ మృద్విశేషాలుగా భాసిస్తున్నా మృణ్మాత్రమే గదా. ఇక్కడా చిచ్ఛక్తి అని
చేతనా రూపా అని రెండు నామాలు మనకు రెండు రహస్యాలు బయట పెడుతున్నాయి. జగత్సృష్టికి శక్తియే ఆధారం. అయితే అది చిచ్ఛక్తి గనుక జడసృష్టికి చేతనమైన జీవసృష్టికి రెండింటికి ఆధార మవుతున్నది. చిచ్ఛక్తి అనే నామం నిమిత్తత్వాన్ని సూచేస్తే చేతనా రూపా అ నే నామం
Page 31