#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

  ఎలా పరిణమిస్తుందని గదా ప్రశ్న. దాన్ని వివరిస్తున్న దీనామం. పరిణానం మూడు విధాలుగా సాగుతుంది. మొదట శక్తి అనేది జ్ఞాన రూపం. చిదేక రస రూపిణి అని పూర్వం ఈ భావాన్నే వర్ణించి చెప్పింది ఒక నామం. చిద్రూప గనుకనే స్వతంత్రమైనదీ ఆ శక్తి. స్వతంత్ర గనుకనే తన ఇచ్ఛానుసారంగా తాను పరిణమించ గలదు. ఇచ్చ అనేది జ్ఞానానికి మాత్రమే లక్షణం. మరి దేనికీ గాదు. అందుకే అణుశక్తి విద్యుత్ శక్తి అని ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు చెప్పే శక్తులన్నీ దానితో పోల్చటానికి లేదు. ఇవి చేతన శక్తులు కావు. జడ శక్తులు. జడశక్తులు గనుకనే తమ ఇచ్ఛతో తాము ప్రవర్తించ లేవు. మరొక చైతన్య శక్తిని ఆశ్రయించి మెలగవలసిందే . దేనినీ ఆశ్రయించక తన పాటికి తాను ప్రవర్తించ గల శక్తి ఈ చైతన్య శక్తి ఒక్కటే. ఇది తన పాటికి తాను ప్రవర్తిస్తూ మిగతా వాటికి కూడా ప్రవృత్తి కల్పిస్తుంది. కనుకనే వాటికంటే ఇది విలక్షణమైన మహాశక్తి అయింది. ఇది లేనిదే మిగతా వాటి కసలు అస్తిత్వమే లేదు.

  జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తిగా మారి అది మరలా క్రియారూపాన్ని ధరిస్తున్నది. మొదటజ్ఞానం తరువాత ఇచ్ఛా ఆ తరువాత క్రియా. జ్ఞానరూపంగా ఉన్నంతవరకూ అది తనలో తానే ఇమిడిపోతుందాశక్తి. అది ప్రసరించాలని చూచేసరికి ఇచ్ఛగా మారుతుంది. ప్రసరించి క్రియ అవుతుంది. ఈ క్రియ అక్కడికి ఆగిపోదు. అది మరలా ఒక ఫలితాన్ని అందిస్తుంది. ఆ ఫలరూపమే ఈ సంసారమంతా. ఫలంకూడా ఫలం కోసమే కాదు. అది జీవుడి అనుభవం కోసం. ఫలభోక్త జీవుడే. అంచేత

Page 29

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు