#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

దాని వరకే ఆగి పోదు. అది కొమ్మలు రెమ్మలు ఆకులు పూవులు కాయలు ఇలా అనేక రూపాలలో అవతరించి కనిపిస్తూనే ఉంటుంది. శక్తి అనేది అంతర్గతంగా ఉండటమే గాక ఎప్పటికప్పుడు ఎలా బహిర్గతమయి కనిపిస్తుందో ఈ ఉదాహరణల వల్ల మనం గ్రహించవచ్చు.

  అలాగే ఆ మహా శక్తి ఎలాంటిదో కూడా మనం గ్రహించవచ్చు. మహాశక్తి గనుకనే అది కూడా అండపిండ బ్రహ్మాండ రూపంగా అసంఖ్యాకమైన రూపాలలో బయటబడి మనకిలా నిత్యమూ భాసించటం మూలాన్నే అనన్యాదృశమైన దాని మహత్త్వం ఎలాంటిదో మనకు చెప్పకుండానే తెలిసుపోతున్నది. ఒకచిత్ర మేమంటే శక్తి అనేది అంతర్గతంగా ఉన్నంతవరకూ దానికి శక్తి అని మాత్రమే పేరు. అదే బహిర్గతమయి తన్ను తానే అనేక రూపాలలో ప్రదర్శిస్తూ పోతే దానికే మాయా అని నామ కరణం చేశారు పెద్దలు. రెండూ ఆ చైతన్య విలాసమే.

12. ఇచ్ఛాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణీ

  అయితే ఒక్కటే అయి గూడా ఆశక్తి అనేక రూపాలలో ఎలా భాసించగలుగు తున్నది. అలా భాసించే అ శక్తులన్నీ ఎలా ఎలా ప్రసరిస్తూ పోతాయని జిజ్ఞాస కలగవచ్చు. శక్తి ఒక్కటే అయినా అది అనేక భూమికలు ధరించగలదు. ఇందులో ఆశ్చర్యమేమి లేదు. అనేక విధాలుగా పరిణమించటమే శక్తికున్న లక్షణమని ఇంతకు ముందే పేర్కొన్నాము. శక్తి అంటేనే పరిణామ శీలమైనది. అప్పుడే దానికి శక్తి అనే పేరు సార్థకమవుతున్నది.

Page 28

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు