#


Index


పూర్వార్ధము - అవరోహణ క్రమము

వ్యవహారాలన్నీ సాగిస్తున్నదది. ఇంతకన్నా మాయా మర్మమేముంది. తనకు వేరుగా ఏదీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు అనుభవానికి వస్తున్నదంటే అదే మాయ. ఇది ఎలాగా అని ప్రశ్నే లేదు. నహి దృష్టి అనుపపన్నం నామ. ఒక ప్రక్క కనిపిస్తుంటే ఇది ఎలా కనిపించ గలిగిందని అడగటం అనావశ్యకం. ఆకాశంలో నలుపు లేకున్నా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే ఏ మిటి జవాబు. చూస్తే కనిపిస్తున్నది. కనిపిస్తుంటే చూస్తున్నాము. చూడటం జీవుడి అవిద్యా దృష్టి అయితే అలా కనిపించటం ఈశ్వరుడి మాయా

11. మహా శక్తిః

  అఘటన ఘటనా పరీయసీ మాయా. అసంభవాన్ని సంభవంగానూ సంభవాన్ని అసంభవం గానూ చూపగలిగిందేదో అదే మాయ. అలాటిది దాని శక్తి. శక్తి రూపంగా ఉంటూనే ఏదేది కోరితే దాన్ని సృష్టించి చూపగలదు. శక్తి స్వభావమే అలాంటిది. అనేక రూపాలుగా పరిణమించటమే దాని స్వభావం. అలా కాకుంటే అది శక్తి అనిపించుకోలేదు. పరిణామం వల్లనే అది శక్తి అని అది ఒకటి ఉందని మనం గుర్తించ గలం. శ్వేతాశ్వతరోపనిషత్తు అలాగే చాటుతున్నది. పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ.

  ఇలాంటి శక్తి లోకంలో సర్వత్రా కనపడుతూనే ఉంది మనకు. సముద్రంలో ఒకానొక శక్తి ఉంది. అది సముద్రం వరకే నిలిచిపోదు. తరంగ ఫేన బుద్బుదాదులైన అనేక వేషాలు ధరించి ప్రతిక్షణమూ ఆవిర్భవిస్తూనే ఉంటుంది. ఒక వృక్షంలో ఉన్న శక్తి

Page 27

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు