పూర్వార్ధము - అవరోహణ క్రమము
పోనీ ఇదేదో క్వాచిత్కంగా ఎక్కడో ఏప్పుడో జరిగే సన్నివేశమని నమ్మకపోవచ్చు మనం. మరి ప్రతి దినమూ రాత్రి కాలంలో చూచే స్వప్నం మాటేమిటి. వీడు వాడనకుండా సర్వులమూ చూస్తుంటాము గదా స్వప్నమనేది. అందులో మనకు మనమే ఎన్నో భంగిమలలో గోచరిస్తుంటాము. ఎన్నో పదార్థాలు గోచరిస్తుంటాయు మన కండ్లకు. వాటితో ఎన్నో విధాలుగా వ్యవహరిస్తుంటాము. ఎక్కడినుంచి వచ్చాయి ఇవన్నీ. అన్నీ మన చైతన్య కల్పితమే గదా. మన చైతన్యమే తన్ను తాను వికల్పించుకొని అలా వివిధ రూపాలలో కనిపిస్తున్నదని ఒప్పుకోక తప్పదు మనం.
ఇలా లౌకికమైన మాయకే జవాబు చెప్పలేము మనం. ఇక లోకోత్తరమైన ఆ మహామాయకేమి చెప్పగలం. అందుకే దాన్ని మాహామాయ అన్నారు. ఇది మాయ అయితే అది మాహా మాయ. అన్ని మాయలకూ అతీతమైన మాయ. ఈ మాయావి తన మాయా బలంతో కొన్ని మాత్రమే చేయగలడు. అవి కూడా ఏదో హస్త లాఘవంతోనో కనుకట్టుతోనో సాధించగలడు. మనకు దృగ్గోచరం కాకపోయినా ఏవో ఉంటాయి వాడి దగ్గర కొన్ని పరికరాలు. వాటి సహాయంతోనే చేసి చూపుతుంటాడామహిమలన్నీ . పరమాత్మ విషయంలో ఇలాటి పరికరాలు కూడా అక్కర లేదు. నిరాకారం కాబట్టి హస్తలాఘవాదుల ప్రసక్తి లేదు. ఆమాటకు వస్తే ప్రదర్శించేది - ప్రదర్శనాన్ని చూచే ప్రేక్షక వర్గమూ రెండూ అ' కాబట్టి కనుకట్టు కూడా లేదు వాస్తవంలో. మరేమిటంటారు. అసహాయ శూరుడి లాగా ఏ పరికరమూ లేకుండానే ఏ మోసమూ లేకుండానే తనకు తానే అనేక రూపాలుగామారి తన దృష్టికి తానే గోచరిస్తూ తన రూపాలతో తానే అన్ని సంబంధాలూ పెట్టుకొని
Page 26