పూర్వార్ధము - అవరోహణ క్రమము
మహామాయా. బ్రహ్మాండమైన మాయా శక్తి అట అది. చైతన్యమే మహామాయా. అదే చైతన్యం అదే మాయ. మాయా మాయావి రెండూ అవే. శక్తి రూపంగా మాయా. శివ రూపంగా మాయావి. ఏమిటి మాయా అంటే మీయతే అనయా ఇతి మాయా. ఏది ఒక పదార్థాన్ని కొలిచి పారేస్తుందో అది మాయ. దేశ కాల వస్తువులనే మూడింటినీ ఇవి యింతా అని కొలిచిచూపిందాశక్తి. అదే మాయా అనే మాటకర్థం.
కావచ్చు. శివతత్త్వం కన్నా భిన్నమైనదేని లేదు అంతా అబద్ధమని గదా వాకుఋచ్చారు. మరి ఈ దేశ కాలాదులేమిటి. వీటినది కొలవట మేమిటి. మృగతృష్ణాంభసి స్నాతః అన్నట్టుందీ మాట అని ఆశంకించవచ్చు. దీనికి సమాధానమేమంటే ఆ చైతన్య రూపమైన శివతత్త్వం తన్ను తానే ప్రపంచ రూపంగా మలుచుకొని చూపుతున్నది. అదే ఈ దేశ కాలాది ప్రపంచం. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోరాదు. ఒక ఐంద్ర జాలికుడు ప్రదర్శించే మాయకే మనం జవాబు చెప్పలేము. వాడికి కూడా మాయావి అనే పేరు. వాడు చూపేది కూడా మాయే. వాడొక్కడే. మరొకడు వాడి ప్రక్కన ఎవడూ లేడు. అయినా వాడొక చోట మన ప్రక్కన కూచొని కనిపిస్తాడు. మరొక చోట దూరంగా పరుగెడు తుంటాడు. ఇంకొక చోట ఒక పగ్గం పైకి విసరి దాన్ని పట్టుకొని పాకి పోతుంటాడు. క్రిందపడి మరణిస్తాడు. మరలా బ్రతికి లేచివస్తాడు. క్రమంగానూ కనిపిస్తాడు. ఒకే మారూ కనిపిస్తాడనేక రూపాలలో. అనేక పదార్థాలను తనకు భిన్నంగా కల్పిస్తూ కూడా పోతాడు. అవన్నీ మనం గ్రుడ్లప్పగించి చూస్తూనే ఉంటాము.
Page 25