పూర్వార్ధము - అవరోహణ క్రమము
జరగవచ్చునంటారు శాస్త్రజ్ఞులు. ఒక పీటమీద పుస్తకం పెడితే అది ఒక ఆరోఫణ. పొయ్య మీదనే పీఠ రూపం కనపడితే అది మరొక ఆరోపణ. పుస్తకం పీట అన్నప్పుడు అవి రెండూ వేర్వేరు పదార్థాలై ఒకదాని పైన వేరొకటి ఆరోపిత మయింది. మరి పీట కొయ్యా అన్నప్పుడు అలా వేర్వేరు పదార్థాలు కావవి. కొయ్యే పీట పీటే కొయ్య. కొయ్యకు భిన్నంగా పీట రూపమెక్కడా కానరాదు. అయినా కొయ్యలో పీట కనిపిస్తున్న దంటే పీట అనేదొకటి ఉండి కాదు కనిపించటం. ఉన్నదొక కొయ్యే. అదే కొయ్యలాగా పీట లాగా కూడా భాసిస్తున్నది.
అలాగే ప్రస్తుతమీ చైతన్య విషయం కూడా. చైతన్యమొక్కటే ఉన్న పదార్థమసలు. నామారూపాధులైన ఈ ఉపాధులేవీ లేవు అయినా ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకు. కనిపిస్తున్నాయంటే ఇవి వాటి పాటికవి స్వతంత్రంగా ఉన్న పదార్థాలు కావు. పీట మీద పుస్తకం లాగా కాక కొయ్య మీద పీట ఆరోపితమైనట్టు ఆరోపితమయినవవి. పుస్తకమంటే కొయ్యకు వేరుగా ఉన్న వస్తువు. పీట వేరుగా ఉన్నదికాదు, వేరుగా ఉన్నట్టు భాసిస్తున్నదంమాత్రమే. ఆ మాటకు వస్తే కొయ్యే కొయ్యగానూ పీట గానూ భాసుసిస్తున్నదని గదా చెప్పాము. అలాగే ఈ సర్వోపాధులనేవి నిజంగా ఉన్నాయి చేశాయి అని చూడరాదు. చైతన్యం మీద ఆరోపితమైనవే ఇవి. పుస్తకం లాగా కాదు.పీట లాగా. పీటకొయ్యకు వేరుగా లేనట్టే ఇవి కూడా చైతన్యానికి వేరు కావు. చైతన్యమే శుద్ధ చైతన్యంగా- ఉపాధి ప్రపంచంగా కూడా కనిపిస్తున్నది. కంటే చైతన్యం కనిపిస్తే ప్రపంచం. గ్రహిస్తే ప్రమాణం గ్రహించబడితే అదే ప్రమేయం.
Page 23