పూర్వార్ధము - అవరోహణ క్రమము
9. సర్వోపాధి వినిర్ముక్తా
సర్వమూ అదే వ్యాపించిందనే సరికి సర్వమనేదొకటి ఏదో ఉంది దాని నిది వ్యాపిస్తుందని అపోహ కలగవచ్చు. అది తొలగిస్తున్నదీనామం. సర్వమూ కేవలం దాని ఉపాధులే. అలాటి ఉపాధులనుంచి వినిర్ముక్తా వివర్జితా. ఏ మాత్రమూ వాటి సంబంధం లేనిదా చైతన్య శక్తి. ఏమిటా సర్వోపాధులు. దానిచేత నిత్యమూ గ్రహించబడే ఈ నామరూపాత్మక ప్రపంచమే. అది ప్రమాణమైతే ఇది దానికి ప్రమేయమని చెప్పాము. అది ఇది అని మాటే గాని అక్కడ వాస్తవానికి రెండు లేవు. ఉన్నదొక్క చైతన్యమే. అది దేన్నో కాదు గ్రహిస్తున్నది కూడా. తన్ను తానే గ్రహిస్తున్నది. గ్రహిస్తుంటే దాన్ని ప్రమాణమన్నాము గ్రహించబడుతుంటే దాన్నే. ప్రమేయమన్నాము. తనకు తానే ప్రమాణం తనకు తానే ప్రమేయమది. చైతన్యం గనుకనే అది సంభవం. రెండు పాత్రలూ అదే అభినయించగల సామర్థ్యముంది దానికి. కనుకనే ప్రమేయమనేది మరొకటేదో ఉందని అపోహ పడరాదు. ఆ ఉందని భావించేదంతా దాని స్వరూపమే. విజ్ఞాన ఘన రూపిణి అని ఒక నామముంది. అది ఈ రపస్యాన్నే చెబుతుంది మనకు. సువర్ణ ఘనం అని పేర్కొంటారు లోకంలో. ఘనమంటే ఏమిటక్కడ అర్థం. సువర్ణం తప్ప మరే విజాతీయ పదార్థమూ దానిలో లేదని గదా. అలాగే జ్ఞానం తప్ప మరేదీ లేదని భావం. మరేదీ అంటే ఏమిటది. ఇదిగో ఈనామారూపాధికమైన సర్వం. దీనికే ఉపాధులని నామాంతరం.
ఏది ఒకదాని మీద ఆరోపించ బడుతుందో అది దానికుపాధి. ఈ ఆరోపణ అనేది రెండు విధాలుగా
Page 22