#


Index


పూర్వార్ధము - అవరోహణ క్రమము

తెలపకపోతే ఈ ప్రపంచమంతా అంధకార బంధురమే. ఎందుకంటే ఆకాశాదులేవీ తమకు తాము గోచరించలేవు. మరొకచైతన్యానికి గోచరించవు. అలాంటప్పుడు అంధకారం కాక మరేముంది .

  అంచేత లోకంలో ఉండే ప్రమేయ జాతానికంతటికీ సిద్ధి అనేది ఏర్పడాలంటే అది చైతన్యం మూలంగానే ఏర్పడాలి. చైతన్యం స్వత స్సిద్ధం గనుక దానికి మరొకదాని అవసరం లేదని చెప్పాము. అది తనపాటికి తాను సిద్ధించి తనకు తాను స్ఫురిస్తూ ఆ స్పూర్తినే ప్రమేయ జగత్తుకంతా పంచిపెడుతున్నది. అలా సర్వత్రా ప్రసరిస్తూ సర్వాన్నీ ప్రకాశింపజేస్తున్నది గనుకనే దానిని సర్వగా అని పేర్కొన్నారు. సర్వం గచ్ఛతీతి సర్వగా. చరాచరాత్మకమైన సకల పదార్థాలనూ వ్యాపించేది అని అర్థం. వ్యాప్తి అంటే వెలపలనే కాదు. లోపల వెలుపల రెంటి మధ్యలో కూడా అని అర్ధం. ఎప్పుడైతే బహిరంతర్ మధ్యాలు మూడూ చైతన్యమే వ్యాపించిందో ఆ పదార్థమంతా చైతన్యశక్తి మయమే కావలసి ఉంది. ఎందుకంటే చైతన్యస్పర్శ లేని భాగానికి అస్తిత్వం లేకపోవలసి వస్తుంది. పదార్థమంతా ఉందని చెప్పామంటే అందులో అన్ని భాగాలూ చైతన్యంతో నిండి పోవలసిందే. అప్పటికి చైతన్యశక్తి అనేది తన వరకే గాక సర్వజగత్తునూ వ్యాపించి తీరవలసిందే. సర్వతోముఖమైన ఈ వ్యాప్తినే సర్వగా అనే ఈ నామం మనకు బోధిస్తున్నది.

Page 21

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు