#


Index


పూర్వార్ధము - అవరోహణ క్రమము

సిద్ధిస్తుందని గదా ప్రశ్న. దాని అస్తిత్వాన్ని అదే గ్రహించగలదు. ప్రపంచమంతా ఇది అనే జ్ఞానానికి గోచరిస్తే- అది ఒక్కటీ నేను నేను అనే జ్ఞానానికి గోచరిస్తుంటుంది. అలా తన జ్ఞానానికే తాను స్ఫురిస్తుంటుంది గనుక దానిని స్వప్రకాశమని పేర్కొన్నారు. స్వ అంటే తనకు తానే ప్రకాశమంటే స్ఫురించటమని అర్థం. అది కర్మ కర్తృత్వ దోషమని కూడా మనం సందేహించనక్కరలేదు. అగ్ని అంటే కాలటం కాల్చటం రెండూ గ్రహించలేని జడపదార్థం కాబట్టి తనలో జరిగే ఏ వ్యవహారమూ తాను గుర్తించలేదు. ఇది అలా కాక చైతన్యరూపమైన మహా శక్తి కనుక నాకు నేనున్నానని- నేనున్నట్టు నాకు స్ఫురిస్తున్నదని తన స్ఫూర్తితో తానుండగలదు. అలా ఉన్నప్పుడే అది స్వతస్సిద్ధమనిపించుకోగలదు. తనకు తానే ప్రమాణమైనా ప్రమేయమైనా. ఇందులో మిగతా ప్రమేయాలలాంటిది కాదని చెప్పటానికి అప్రమేయ అన్నారు. తనకు తానే ప్రమేయమవుతున్నది గనుక స్వప్రకాశ అన్నారు.

8. సర్వగా

  ఈ విధంగా ప్రమాణమూ ప్రమేయమూ రెండూ తానే అయి ప్రకాశించటమనేది చైతన్యానికి తప్ప మరి దేనికి గాని సంభవం కాదు. నేను అని భావించగలిగినదేదో దానికే సంభవం. అలాభావించ గలిగింది ఒక్క చైతన్యమే. అచేతనమైన ఆకాశాది భూతజాతమేదీ నేనున్నానని తన అస్తిత్వాన్ని తాను స్మరించలేదు. కనుకనే తన అస్తిత్వం కోసం మరొక ప్రమాణం మీద అవి ఆధారపడక తప్పటం లేదు. అలాంటి ప్రమాణం ఈ చైతన్యమే గాని మరొకటి లేదని ఇంతకు ముందే నిర్ణయించాము. చైతన్యమే ఇది ఆకాశమని ఇది వాయువని మనకు తెలుపుతున్నది. అది

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు