#


Index


పూర్వార్ధము - అవరోహణ క్రమము

బాహ్యేంద్రియాలు ఐదు. మనస్సనే అంతరింద్రియమొకటి. ఇవి రెండూ మనకు ఆజన్మసిద్ధమే గదా. ఇందులో మొదటిది ప్రత్యక్షమైతే రెండవది అనుమానమని పేర్కొన్నాము. మొదటి దానితో పర్వతం మీద ఉన్న ధూమాన్ని చూచి తెలుసుకొంటే రెండవదానితో అగ్నిని ఊహించి తెలుసుకొంటున్నాము. ప్రపంచంలో ఏజ్ఞానమైనా ఈ రెండింటి ద్వారా కలగవలసిందే.

  ప్రస్తుత విషయంలో ఈ రెండు ప్రమాణాలూ పనిచేయటం లేదు. చిచ్ఛక్తి ఒకటి ఉన్నట్టు ప్రత్యక్షమూ చెప్పలేదు మనకు. అనుమానమూ చెప్పలేదు. కారణమేమంటే అది ప్రమేయం గాదు. ప్రత్యక్షానుమానాలకు రెండింటికీ విషయం కాదని అర్థం. ప్రమాణ విషయం కాకపోతే అది ఉన్నదని ఎలా నిరూపించగలమని ప్రశ్నవస్తుంది. ప్రమాణం పనిచేయక పోయినా దాని అస్తిత్వానికేలాటి ప్రతిబంధకమూ లేదు. అచేతనంటే అది ప్రమాణ రూపమే. ఏది నీవు ప్రమాణమంటున్నావో- అది ప్రత్యక్షమే గావచ్చు అనుమానమే గావచ్చు- రెండూ కూడా వాస్తవంలో చైతన్యమే గాని మరేమి కావు. చైతన్యమంటే జ్ఞానమే. జ్ఞానానికే గదా ఏదైనా గోచరించవలసింది. జ్ఞానమే చక్షుస్సు ద్వారా ప్రసరించి బాహ్యమైన వస్తుజాలాన్నీ- చిత్తం ద్వారా ప్రసరించి ఆంతరమైన సుఖదః ఖాదులనూ- ప్రతిఒక్క ప్రమేయాన్నీ ప్రమాణమై గ్రహిస్తున్నది. జ్ఞానం లేకపోతే కన్ను పనిచేయదు. చెవులు పనిచేయవు. మనసు పనిచేయదు. అవిపనిచేస్తున్నాయంటే వాటి ద్వారా పనిచేస్తున్నది జ్ఞానమే కనుక అదే ప్రమాణం. అలాంటి దానిని తెలుసుకోటానికి మరొక ప్రమాణంతో నిమిత్తమేముంది. దీపానికి దీపమక్కర లేనట్టే ప్రమాణానికి ప్రమాణం అక్కర లేదు. ఉందని చెబితే కర్మ కర్తృత్వ

Page 18

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు