పూర్వార్ధము - అవరోహణ క్రమము
6. అప్రమేయా
చిదేకరూపిణే గనుక ఆశక్తి ప్రమేయ గాదు. అప్రమేయ. ' ప్రమేయగానిదేదో దానిక ప్రమేయ అని పేరు. ప్రమాణానికి గోచరించేది ప్రమేయ. లోకంలో ఏ వస్తువైనా సరే ఏదో ఒక ప్రమాణానికి గోచరించవలసిందే. ప్రమాణానికి గోచరించని దానికి అస్తిత్వం లేదు. అస్తి అని చెప్పామంటేనే అది ఏదో ఒక ప్రమాణంతో తెలుసికొని తెప్పవలసి వస్తుంది. చూడండి ఘటముంది పటముంది అని ప్రతిఒక్కదానిని ఉంది ఉంది అని వాటి అస్తిత్త్వాన్ని గ్రహిస్తున్నాము. దేనితో గ్రహిస్తున్నాము. కంటితో చూచి- చెవులతో విని- చర్మంతో స్పృశించి- ఇలాగే గదా గ్రహిస్తున్నాము. చక్షురాదులైన ఈ ఇంద్రియాలే ఘటపటాదులున్నాయని చెప్పటానికి ప్రమాణాలవుతున్నాయి. వీటికే ప్రత్యక్ష ప్రమాణమని పేరు. అలాగే దూరంగా ఒక పర్వతం మీద ధూమం పైకి లేవటం చూచి అక్కడ అగ్ని ఉందని మనం చూడక పోయినా దాని అస్తిత్వాన్ని మనం నిశ్శంకంగా చాటి చెబుతాము. చూడకుండా ఉందని ఎలా చెప్పగలిగాము. ఏది చూచావె దాని బలంతో చెప్పగలుగుతున్నాము. చూస్తున్నదేదక్కడ. ప్రత్యక్షమైన ధూమం. దాని బలంతో అగ్నిని ఊహిస్తున్నాము కాబట్టి దీనికనుమాన ప్రమాణమని పేరు. మానమంటే ప్రమాణానికి మరొక పేరు. ప్రత్యక్షమైన చక్షురాది ప్రమాణాన్ని అనుసరించి ఏర్పడుతుంది గనుక ఈ ప్రమాణానికి అనుమానమని పేరు వచ్చింది.
ఇంతకూ ప్రత్యక్షానుమానాలనేవి రెండే వస్తుతః మనకున్న ప్రమాణాలు. ఇవి రెండే మనకు నిసర్గ సిద్ధమైనవి. చక్షురాదులైన
Page 17