#


Index

సింహావలోకనము

ఆద్యంత వర్ణాలను కలుపుకొని సంసారమనే కారాగృహంలో ప్రవేశించి అక్కడే బందీ అయ్యాడు. ఈ బందీ కావటమే అమ్మవారి తిరోధానమని భంగ్యంతరంగా గ్రహించ వచ్చు.

  పోతే ఈ తిరోధానం నుంచి బయటపడి మరలా ఆవిడ అనుగ్రహానికి అఱలు చాస్తే- ఈ గణేశ్వరుడే మరలా మహాగణేశ్వరుడు కాగలుడు. భూత గణ సంసర్గం వదలుకొన్న వాడే మహా గణేశ్వరుడు. సంసారమనే విఘ్నయంత్రం వెంటాడుతున్నంత వరకూ అది మనకు అందని మ్రాని పండు. అంచేత మొదట మనమీ విఘ్నయంత్రాన్ని భేదించాలి. ఎలా భేదించటం. శివ తాదాత్మ్యాన్ని విమర్శిస్తూ పోవటమే దానికుపాయం. ప్రకాశం శివుడు. విమర్శ మాయన శక్తి. విమర్శ లేనంత వరకూ ప్రకాశం సహజంగా ఉన్నా ప్రకాశించదు. గుప్తంగా సుప్తంగా ఉండిపోతుంది. అంతే కాదు మరొక రూపంలో భాసిస్తుంది మనకు. అదే ఇప్పుడీ సంసారం. దీని వల్లనే వీడు గణేశుడయ్యాడు. బహు జన్మ సంస్కారం వల్ల గానీ-గురూప దేశం వల్ల గానీ మెళకువ వస్తే మరలా తన చైతన్య ప్రకాశాన్ని విమర్శించుకోకలడు. అది పరాకాష్ఠ చెందితే విఘ్నయంత్రాన్ని భేదించి మహాగణేశు డౌతాడు. అప్పుడా జగన్మాత ప్రహుష్టురాలై శివ సాయుద్యాన్ని వీడికి ప్రసాదిస్తుంది. మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా అనే నామం ఈ అర్థాన్నే స్పష్టంగా తెలుపుతున్నది. ఈ రెండు నామాలు జీవుల రెండు అవస్థలకు ప్రతీకలు. కామేశ్వర ముఖాలోక అనేది వీడి బంధావస్థను సూచిస్తే- మహాగణేశ నిర్భిన్న అనేది మోక్షావస్థను సూచిస్తున్నది. మొదటి దానిలో కా

Page 127

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు