సింహావలోకనము
ఇలా గురువొక విద్యను బోధించటానికీ- శిష్యుడు దాన్ని సాధించటానికీ- ఏ రెండు లక్షణాలుండ వలెనో అవి ఈ నామ కరణం చేయటంలోనే తెలిసిపోతున్నాయి. అసలా మాటకు వస్తే గురు వన్డే దా పర దేవతే. సకల జీవులకూ ఆవిడే గురుస్థానం. గురుమూర్త అని గురుమండల రూపిణి అని అందుకే కీర్తించి రావిడను. హయగ్రీవుడికా సహస్ర నామాలు మొదట ఉపదేశించిం దావిడే నని బ్రహ్మాండ పురాణం చెప్పే మాట. మరి ఆవిడ వల్ల ఈ మంత్రోపదేశ మందుకొన్న హయగ్రీవుడు కూడా ఎవరో కాదు. వాస్తవాని కాయన గజగ్రీవుడైన గణేశుడే.
ఎవరీ గణేశ్వరుడు. ఎలా జన్మించాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా అని నామం. శివ చైతన్య బలంతో ఆ మహా శక్త కల్పించిన జీవుడెవడో వాడే గణేశ్వరుడు. శివ శక్తి సంయోగం వల్ల ఏర్పడ్డ వాడని అర్థం. చిజ్జడయోః గ్రంధిః జీవః అని ప్రసిద్ధి. జీవుడు చేసుకొన్న కర్మ వల్ల ప్రకృతి పురుషులైన ఆ శివ శక్తులకు ఇలాంటి సంకల్పము దయిస్తుంది. తదనుగుణంగానే ఈ జీవ సృష్టి. కనుకనే పార్వతీ పరమేశ్వరులే గణేశునికి జననీ జనకులని పురాణాలు చాటుతున్నాయి. ఇంతకూ జీవుడికి సంకేతమే గణేశ్వరుడు. భూత భౌతిక ప్రపంచానికి గణమని పేరు. శరీర మనః ప్రాణేంద్రియ సంఘాతమైనా కావచ్చు గణం. ఆ గణానికీ జీవుడే గదా అధిపతి. కనుక జీవుడే గణపతి.
ఈ గాణాపత్యమే వీడికి బంధ హేతువు. దాని వల్లనే కర్మ చేస్తాడు. సుఖ దుఃఖాదు లనుభవిస్తాడు. ఈ కరృత్వ భోక్తృత్వాలు మనః ప్రాణాల వల్ల ఏర్పడుతున్నాయి. అవి వీడికి
Page 125