ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
శక్తిమంతు లిరువురికి బేధం లేదని సిద్దాంతం. కనుక ఆ రెండింటికీ నిత్యమూ అవినాభావమే. ఇదే పురాణాలలో అర్ధనారీశ్వరమనీ-శైవాగమాలలో మహా మైథునమనీ అనేక విధాలుగా వర్ణించ బడుతున్నది. ఏ విధంగానూ చిదభిన్న శక్తి- శక్త్యభిన్న చితి ఆత్మా భిన్నంగా చితి శక్తులు రెండూ కలిసి ఏకమే నని అనుసంధానం ఏమరరాదు తత్త్వ జిజ్ఞాసువులు. అప్పుడే అది మోక్ష ఫలాన్ని సాధకులకు ప్రసాదించ గలదు.
Page 122