ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
కనుకనే మృత్యుంజయ సూక్తంలో మృత్యోర్ముక్షీయ అని అక్కడికి విరమించ లేదు. మా అమృతాత్ అని మరలా పేర్కొన్నది. ఇది పునరుక్తి కాదు. ఇందులో ఒక విశేష ముంది. మృత్యోర్ముక్షీయ అన్నప్పుడు. మృత్యు ముఖంలో పడకుండా బయట పడాలని ఆకాంక్ష. మా అమృతాత్ అన్నప్పుడు అమృత రూపమైన మోక్షాన్ని పొంది అక్కడినుంచి మరలా వెనక్కు రాగూడదని అభిప్రాయం. వెవక్కు వస్తే శాశ్వతీ అనే మాటకర్థం లేదు. అంచేత మోక్షావస్థ తక్కిన అవస్థలలాగా కాదాచిత్కం గాదు. శాశ్వతికం.
శాశ్వతం కనుకనే అది శ్రీ శివా అని కూడా కీర్తించ బడుతున్నది. శాశ్వత మైనదేదో అదే శివం. తాత్కాలిక మైనది శివం కాదు. శవం. ఉత్పత్తి వినాశాలు ఉన్నదెప్పుడూ శవమే. అది అతి కష్టమైన మన ఈ సంసార దశే. ఎంతో కష్టం మీద దీన్ని దాటి పోయి దాన్ని పట్టుకొన్నాము. అలాంటప్పుడది శివం కాక మరొకటెలా కాగలదు. కేవలమూ శివమే కాదది. శ్రీ కూడా. శ్రీ అనే మాటలో శక్తి అనే భావం ధ్వనిస్తున్నది. శివ అనేది శివ నామం. శ్రీ అనేది శక్తి నామం. రెండూ ఏకమై ఏకరూపాన్ని భజిస్తున్నాయి. శివ శక్తేక్య రూపిణి అని అమ్మ వారికి వేరొక ప్రసిద్ధమైన నామముంది. శివ శక్తులు రెండూ కలిసి ఏక రూపమేనని చెబుతున్నదా నామం.
కాకున్నా శక్తి లేకుండా శివం. శివం లేకుండా శక్తి స్వతంత్రంగా ఉండలేవు. శివమంటే జ్ఞానం. శక్తి అంటే ఐశ్వర్యం. ఒకటి జ్ఞాన శక్తి. ఇంకొకటి కి యాశక్తి. శ్రీ అనే మాట ఇక్కడ ఆ కి యా శక్తినే సూచిస్తున్నది. శివ అనేది జ్ఞానాన్ని సూచిస్తున్నది. శక్తి
Page 121