ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
కార్యమైన జగత్తుతో సహా- సాధకుడంతా తన స్వరూపమేనని భావించటమే యజమాన్ స్వరూపిణి అంటె.
పోతే ఇలాటి యజమాన స్వరూపిణి కాదు బాహ్యమైన యజ్ఞాది సామగ్రి. అందులో యజమానుడూ- యజ్ఞక్రియా- . తత్పలమైన స్వర్గాదులూ- అక్కడికి ప్రయాణమూ - ఇలాటి వివిధ. రూపములైన సాధన సామగ్రి ఉంది. అంతే గాక దానినంతటినీ అనుష్టించినా వెంటనే ఆ స్వర్గ ఫలం సిద్ధించదు. కాలాంతరంలో కలుగుతుందని వార్త. అది ప్రత్యక్షంగా తార్కాణమయ్యేది కాదు. కేవల శాస్త్ర మాత్ర గమ్యమైన విషయం. మరి ఈ మోక్ష విషయ మలాంటిది కాదు. ముందు వర్ణించిన సామగ్రి అంతా యజమానుడి స్వరూపానికి వేరుగా లేదు గనుక కాలాంతరం వరకూ ప్రతీక్షించ బని లేదు. జ్ఞాన సమకాలంలోనే సిద్ధి కలుగుతుంది. కలుగుతుందా లేదా అనే విచికిత్స కూడా లేదు. శ్రుతే గాదిక్కడ ప్రమాణం. జ్ఞానుల అనుభవమే గనుక ప్రత్యక్షం కూడా ఇక్కడ ప్రమాణమే. ఇలా ప్రత్యక్షసిద్ధం గనుక నిత్య సుఖదాయకం గనుక ఈ మోక్ష పురుషార్థమే పరమ పురుషార్థం. కాబట్టి సాధకుడైన ప్రతి ఒక్కడూ దీనినే భజించి ఆ సద్యః ఫలానికి నోచుకోవాలని ఫలితార్థం.
51. సర్వాంత ర్యామినీ
52. పూర్ణా
ముక్తి యజమాన స్వరూపమనే సరికి అక్కడ తప్ప మరెక్కడా మనకది లభించవేమో ననే భ్రాంతి ఒకప్పుడు కలగవచ్చు. అలాంటి అపోహ పెట్టుకోగూడదని చెప్పటానికే ఈ నామం. చిద్రూపిణి అయిన ఆ దేవత ఒక యజమానుడిలోనే
Page 118