#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

వాటిని సృష్టించ గలదు. సృష్టించిన అవి ఏవో కావు మరలా అది ఆవిడ విభూతే. విభూతి దశలో వ్యవహారమనే దానికి లోటు లేదు. హేయోపాదేయాలతో క్రీడించ వచ్చు. అప్పుడు వర్జితం కావవి. ఉన్నవే. దాని కనుగుణంగా మనమీ నామానికి అర్థం చెప్పినా చెప్ప వచ్చు. హేయ వర్జితా అంటే ఉపాదేయత ఉందనీ- ఉపాదేయ వర్జితా అంటే హేయత ఉందనీ- వెరసి రెండూ ఉన్నాయని భావం. ఇలాంటి వ్యవహారం ఆ దేవతకెలాగో- అలాగే ఆ దేవతాత్మ భావాన్ని • అందుకొన్న ఈ జీవన్ముక్తుడికీ సంభవమే.

38. అభ్యాసా తిశయ జ్ఞాతా

  ఇక్కడ ఒక ఆశంక కలగవచ్చు. జీవన్ముక్తి రూపమైన ఈ పరా నిష్ఠ మనకీ జీవితంలో కలుగుతుందా. వ్యాస వసిష్ఠ శుకాదులైన ఉత్తమాధికారులం కాము గదా మనం. మహా అయితే మంద మధ్యమా ధికారులం. ఇలాంటి మహా భాగ్యానికి తగిన యోగ్యత మనకున్నదా అని శంకించ వచ్చు.

  దీనికి పరిహారం చెబుతున్నదీ నామం. అభ్యాసా తిశ యజ్ఞాతా అని సమాధానం. నిష్ఠ అనేది ఎంత దుర్లభమని భావిస్తున్నామో- అంత సులభం కూడా. దుర్లభా సులభా అని రెండు నామాలు కూడా ఉన్నాయి నామావళిలో. అది సాధకు లిక్కడ గుర్తు చేసుకోవచ్చు. అభ్యాస మనేది అతిశయ మయ్యే కొద్దీ- నిష్ఠ అనేది తప్పక లభిస్తుంది. అభ్యాసమంటే మాటి * మాటికీ చేసుకొనే అనుసంధానం. అభ్యాసేన తు కౌంతేయ- అని గీతాచార్యుడూ- అభ్యాస వైరాగ్యాభ్యాం - అని పతంజలి ముక్త కంఠంతో చాటి చెప్పారు. అభ్యాసం చేత సాధించ లేనిదంటూ లేదు. లోకంలో ఎలాగో పరమార్ధంలో కూడా అదే ఉపాయం.

Page 107

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు