#


Index

  పెద్దవాడా కుర్రవాడా ఇంతకూ. కుర్రవాడుగా మన కంటికి కనిపిస్తున్నాడే గాని నిజానికి కుర్ర గాదు. పెద్దే. పెద్దంటే మామూలు పెద్ద గాదు. అణో రణీయాన్ మహతో మహీయాన్ అనే ఉపనిష ద్వాక్యానికిది ప్రతిధ్వని. అణువు కన్నా అణువూ మహత్తు కన్నా మహత్తు కూడా అది. అదే మహా డింభకుడని చతుత్కారంగా అన్నాడు మహాకవి.

  పోతే ఇక ఈ పద్యంలో చేసిన వర్ణన అంతా కృష్ణావతార వర్ణనే. లోక రక్షై కారంభకు డాయన. లోక రక్ష ఎలా ఏర్పడుతుంది. అధర్మ విజృంభణా ధర్మ విప్లవమూ సాగినంత వరకూ అది సంభవం కాదు. అధర్మానికి ప్రతీక దానవులైతే ధర్మానికి ప్రహ్లాదాదులైన భాగవతులు. కనుక దానవోద్రే కస్తంభకుడై తద్ద్వారా భక్త పాలన కళా సంరంభాన్ని చూపవలసిన వాడయ్యాడు. నిజాని కది సంరంభమే గాదు. ఆయన పాలిటి కది ఒకలీల. మన కోసం ప్రదర్శించే ఒక కళ. ఎందుకంటే అసలీ దుష్టులూ లేరు శిష్టు లూ లేరు - ఆయన శిక్షించటానికీ - రక్షించటానికీ. అధర్మమూ లేదు ధర్మమూలేదు- ఆయన లోకస్థితిని కాపాడటానికి. అంతా మిథ్యా - మాయ. ఇదంతా ఒక నాటకం. యత్రత్రిసర్గో మృషా అని మొదటనే ఘోషించింది భాగవతం. సృష్టే మృష అయినప్పు డాసృష్టిలోని దేవ, దానవ జాతులూ-వారి మంచి చెడ్డలూ వాటి కోసం భగవదవతార సంరంభమూ ఇదంతా సత్య మెలా కాగలదు. అది మృష అయితే ఇది ఒక మిష అనే అనుకోవాలి మనం. అదే వ్యంగ్యంగా బయట పెడుతున్నాడు మహాకవి కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు డనే మాటలో. ఈ బ్రహ్మాండ భాండాలన్నీ ఆయన ఒక కుమ్మరి లాగా దండమూ, చక్రమూ, సూత్రమూ పెట్టుకొని సృష్టించలేదు. ఈ సృష్టి ఆయన దృగ్జాల సంభూతమట. దృగ్జాల మేమిటి. దృక్కే జాలం. దృక్కంటే దృష్టి. జాల మంటే మాయ-ఇంద్రజాల మనే మాటలో తెలుస్తుంది మనకు. జాల మంటే కేవలం మాయ. తన చైతన్య రూపమైన దృక్కును నిరంతరమూ ఆశ్రయించి ఉన్న ఏ మాయా

Page 97