#


Index

  నీవు రాజువై కూడా కామమనే వ్యసనానికి వశుడివయి పోయావు. తండ్రి అన్న ఆచార్యుడు-వీరు ముగ్గురూ కూడా తండ్రులే వాస్తవానికి. అలాంటి తండ్రి హోదాలో ఉన్న నీవు పుత్రుడిలాంటి నీ తమ్ముడి భార్యతో సంగమించే సాహసం చేశావు. వాడు బ్రతికి ఉండగా నీవాపని చేయరాదు. మహాపరాధం. అపరాధివి గనుక నీకునేను శిక్ష విధించాను. భరతుడు రాజు. మేమాయన ప్రతి నిధులము. నీవపరాధివి. దండించకుండా ఎలా ఉండగలము. అయితే సుగ్రీవుడితో ఎందుకు సఖ్యమంటావా-వాడు నాకు లక్ష్మణుడి వంటి వాడు. నా శ్రేయస్సు కోరేవాడు. శపథం కూడా చేశాను నేను వాడికి మేలు చేస్తానని. మరి దాన్ని భంగం చేయట మేమిబాగు. నీవు కూడా వాడికది చేసి ఉండవలసినది. కాని చేయలేదు. మరి చాటు నుంచి బాణం వేసి చంపావని గదా ఆక్షేపించావు. మేము క్షత్రియులం. మృగాలను వేటాడటం మాకలవాటు. వాటికెదురుగా ఉండే చంపనక్కరలేదు. వెనుకనుంచి ప్రక్క నుంచి దూరం నుంచి దగ్గర నుంచి కనపడుతూ కనపడకా - ఎలా చంపినా చంపవచ్చు వాటిని. నీవూ అలాంటి ఒక శాఖా మృగానివే. కాబట్టి చాటు నుంచి చంపినా నీవు తప్పు పట్టటానికి లేదు. అంచేత ధర్మసూక్ష్మం తెలుసుకోకుండా మాట్లాడకు. చపలుడివినీవు. పుట్టుగ్రుడ్డివి. నీకు ధర్మమే మెఱుక, స్వయంగా ఎఱుగవు. ఎఱుక గల పెద్దల నడిగి తెలుసు కోవు. సూక్ష్మమూ పరమాద్భుతమూ ధర్మమంటే. ఇప్పటికైనా తెలుసుకోటం మంచిది. ఇదీ రాముడిచ్చిన సమాధానం.

  దీనితో వాలి ఇక నిరుత్తరుడయి పోయాడు. యత్త్వమాతనర శ్రేష్ఠ తదేవ-నాత్రసంశయః-నీవేది చెప్పావో అది అంతే. దానికిక తిరుగు లేదు. అనవసరంగా నిన్ను తూలనాడాను. నన్ను మన్నించమని వేడుకొంటాడు. అయితే అతడు మన్నించమన్నా మనం మన్నించలేక పోతున్నాము రాముణ్ణి. ఎన్ని సమాధానాలిచ్చి వాలిని నోరుమూయించినా అవన్ని కుంటి గుడ్డి

Page 82