#


Index

  _మా వాడితో తలపడ్డాను. నీవు కీడు చేయనేచేశావు. కనపడకుండా చాటు _నుంచి చేశావు కాబట్టి బ్రతికి పోయావుగాని దృశ్యమానస్తు యుధ్యేధా మయాయది నృపాత్మజ - అద్యవైవస్వతం దేవం - పశ్యేస్త్వం నిహతోమయా. నా కంటబడే నీవు యుద్ధం చేసి ఉంటే ఈ పాటికి నా చేత చావు దెబ్బలు తిని యమధర్మరాజును దర్శించే వాడివి. కాక పోయినా నీవెంత అమాయికుడివి, నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. సీత కోసమే ఇంతపని చేశావంటే సిగ్గుచేటు. సీత కోసమే అయితే కంఠే బద్ధ్వా ప్రదద్యాంతే-నిహతం రావణంరణే-ఆవిడ నపహరించిన రావణుణ్ణి చంపకుండానే పట్టి తెచ్చి నీ పాదాలముందు పడవేసేవాడిని. కుర్రకుంక సుగ్రీవుడా నీకు తోడ్పడేవాడు ఏమయినా సరే నీవు చేసింది పొరబాటు. నేను చస్తే నా అనంతరం నా తమ్ముడు రాజ్యానికి రావటం ధర్మమే గాని నా తమ్ముణ్ణి నా నుండి చీలదీసి నీవు నన్ను అక్రమంగా వధించటం మాత్రమే మాత్రమూ ధర్మం కానేరదు.

  ఇలా ఒకటిగాదు-రెండుగాదు. సవాలక్ష నిష్ఠురా లాడాడు వాలి రాముణ్ణి. అంతకన్నా నీవూ నేనూ ఆక్షేపించలేము కూడా. అయితే ఈ ఆక్షేపణలన్నింటికీ ఏమిటి సమాధానమని అడగవచ్చు. అది కూడా వాల్మీకే చాటి చెప్పాడు లోకానికి. ఆక్షేపణ వాలి ముఖంగా వినిపించి అందులో ప్రతి ఒక్కదానికీ సమాధానం రాముడి ముఖంగా మనకు వినిపిస్తాడాయన. అవిజ్ఞాయ కథం బాల్యా - న్మామిహాద్య విగర్హసే - అని మొదట చీవాట్లు పెడతాడు రాముడు వాలిని. వాలీ నీకు ధర్మం తెలీదు. అర్థం తెలీదు-కామమూ తెలీదు. పురుషార్థమంటే ఏమిటో తెలీదునీకు. ఏదీ తెలియకుండానే నన్నధిక్షేపిస్తున్నావు. ఇక్ష్వా కూణా మియం భూమిః- ఈ భూమండల మంతా ఇక్ష్వాకు చక్రవర్తులది. ఇందులో నివసించే మృగ పక్షి మనుష్యజాతులలో ఎవరే తప్పు చేసినా శిక్షించే అధికారి భరతుడు. ఆయన నియమించిన అధికారులం మేము. వన భూముల కంతా పాలకులం.

Page 81