#


Index

మరొకటి తత్తదుపాధి లక్షణాలను అనుసరిస్తూ అలా లోకానికి ప్రదర్శించటం కావాలి. రెండూ స్వలక్షణం కావటానికి లేదు. అలాగే అయిననాడు రాముడెప్పుడూ సీత నంటిపెట్టుకొనే ఉండాలి. విడిచి పెట్టగూడదు. ఎవరేమన్నా పట్టించుకోగూడదు. అలా చేశాడా మరి జీవితంలో. చేయలేదే. అప్యహం జీవితం జహ్యాం త్వాంచ సీతే సలక్ష్మణాం - నతుప్రతిజ్ఞాం సంశ్రుత్య - నేను నా జీవితమైనా వదలుకోగలను- నిన్నెనా వదులుకోగలను లక్ష్మణణ్ణనా వదలగలను. కాని నాకు మాటంటే మాటే. అది మాత్రం వదలలేనని సీతతోనే అన్నాడాయన ఒకమారు. అలాగే నిలబెట్టు కొన్నాడామాట. ఎవరూ ఆక్షేపించకముందే ఆవిడ ననుమానించి పరీక్ష పెట్టాడు లంకలో. అయోధ్యలో మరలా ఎవడో ఆక్షేపించాడని అసలే పరిత్యజించా డావిడను. తరువాత ఇక తాకి తలుచుకోలేదు. లక్ష్మణుణ్ణతే ప్రతిజ్ఞ కోసం దేశాంతరానికే వెళ్ల గొట్టాడు. అంత నిష్కామంగా వ్యవహరించ గలిగిన వాడంత కాముకడయి బేలగా పలవించాడంటే ఎలానమ్మటం. కనుకనే ఇది కేవల మభినయమని వాక్రుచ్చటం- లోకాని కలాటి వ్యసనం పరికిరాదని బోధించటమే ఈ అభినయాని కంతటికీ ఫలశ్రుతి అని కూడా హెచ్చరించటం.

  ఇక్కడికి కామవ్యవహారం పరిష్కారమయింది. పోతే ఇక కిష్కింధలో పరిష్కరించవలసిన వ్యవహారం మరొకటున్నది. అది వాలి వధ వ్యవహారం. ఒక న్యాయస్థానంలో వ్యవహారంలోగానే అది కొన్ని శతాబ్దాలబట్టీవిమర్శ లోకంలో పాతుకొని ఉంది. ముఖ్యంగా హేతువాదులీ కాలంలో దాన్ని మరీ సాగదీస్తున్నారు. వారనేదేమంటే రాముడు వాలిని వధించటం అన్యాయం. అపచారం. అతడాయనకు చేసిన అపకారమేమిటి. సుగ్రీవుడు చేసిన ఉపకారమేమిటి. ఏదీ కాదు. వాలి సుగ్రీవులిద్దరూ తన కంతవరకూ అపరిచితులే. ఎవరివల్లా తనకు మంచిగాని చెడ్డగాని ఏదీ జరగలేదు.

Page 79