ఇక రెండవ అక్షేపణ అరణ్యకాండలో శూర్పణఖా పరాభవ ఘట్టాన్ని గురించి. శూర్పణఖను పరాభవించి నందుకుగాదు. అది అనుచితంగా ప్రవర్తించినందుకు పరాభవించవలసిందే. తప్పులేదు. కాని అది ఒక రాక్షసి-పనికిమాలినదని తెలిసికూడా దానితో పరియాచక మాడటం పొరబాటు. ఊరక హస్యమాడటమే గాక అబద్ధమాడట మంతకన్నా తప్పు తానొక ధీరోదాత్తుడైన రాజపుత్రుడు. లోకంలో పేరు ప్రతిష్ఠ లున్నవాడు. అదా ఒక ఊరు పేరు లేని గయ్యాళి రాక్షసి. దానితోనా వేళాకోళాలూ- అబద్ధాలూ-రామో ద్విర్నాభిభాషతే- సత్యవాక్యో జితేంద్రియః అనృతంనోక్త పూర్వంమే నచ వక్ష్యే కదాచన- రాముడు రెండు సార్లు మాటాడడు. అతడేది మాటాడినా నిజమే తప్ప అబద్ధం మాటాడడు అని గదా మొదటి నుంచీ తనకు పేరు. అలాంటివాడు ఆ దానవితో ఎలా ఆడాడబద్ధం. ఏమిటా అబద్దం. కృతదారోస్మి భవతి-భార్యే యం దయితా మమ- అనుజ స్త్వేషమే భ్రాతా- శ్రీ మాన కృత దారశ్చ- లక్ష్మణోనామ వీర్యవాన్ అనురూపశ్చతే భర్తా- రూపస్యాస్య భవిష్యతి- ఏనంభజ విశాలాక్షి భర్తారమ్- అమ్మా నేను పెండ్లయిన వాడను. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నీవా సవతి పోరు భరించలేవు. ఇడుగో నా తమ్ముడు లక్ష్మణుడు. నీకు తగినవాడు. వాడికింకా పెండ్లి కాలేదు. వాణ్ణి పోయి పెండ్లాడు చక్కగా ఉంటుందంటాడు. పైగా వాడు పెండ్లాంకోసం పరితపిస్తున్నాడట. ఏమిటీ మాటలు. రాముడంత వాడన వలసినవా. పచ్చి అబద్ధం కదా. అంతేకాదు. తాను దానితో ఇంతగా హాస్యమాడి అలాటి హాస్యమే తమ్ముడు కూడా ప్రయోగించాడని చెప్పి వాణ్ణి మందలిస్తాడు మరలా. క్రూరై రనార్యై స్సౌమిత్రే- పరిహాసః కథంచన నకార్యః పశ్య వైదేహీం - కథం చిత్సౌమ్మ జీవతీమ్ -' పనికిరాని హల్కా మనుషులతో చదురులాడరాదు. చూడు సీతను చంపుతానని వచ్చిపైన బడుతున్నది. దీన్ని ముక్కు చెవులు కోసి పంపమని కోపంతో అంటాడు. ఇదీ వరస. ఇదెంతబాగుందో చూడండి ఈ వ్యవహారం. 3 దీన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్న.
Page 70