#


Index

తగిన శిక్ష ఆయనకు తాను దేవుడుగా విధించవలసిందే. అందుకే అక్కడ ఎక్కడా గాక అడవిలో ఏకాంతంగా ఎవరూ వినకుండా ఒక్క లక్ష్మణుడితోనే అన్నాడీ మాటలు. ఈ మాటలు మనమిక్కడ దేవుడి హోదాలో అర్థం చేసుకోవాలి. జీవుడి హోదాలో కాదు. అర్థ ధర్మాల కన్నా మిన్నగా కామాన్నే సేవించట మధర్మం. అది రాజైన వాడి కేమాత్రమూ’ తగదు. అలాంటి తగని పని చేశాడు తండ్రి. తండ్రి అయినా అలా చేయట మనుచితమే. అనుచితం గనుకనే శిక్షకు పాత్రుడు. ఏమిటా శిక్ష. మయాచైవ వినాకృతః అనే మాటలో మన్యే దశరాథాంతాయ-అనే మాటలో సూచిత మవుతున్నది. నేను దూరమై పోవటమే ఆయనకు నేను విధించిన శిక్ష, తనకు దూరమైతే ఏమవుతాడు. అంతమైపోతాడు. కాముకుడు బ్రతకకూడదు. బ్రతికినా అది పనికిమాలిన బ్రతుకే. కామాన్ని అసలు సేవించగూడదని కాదు. ధర్మావిరుద్ధంగా సేవించాలది. అలా సేవించలే దిప్పుడు దశరథుడు. అంచేత తన వియోగానలాని కాయన జీవితం ఆహుతై పోవలసిందే తప్పదు. పరమాత్మగా తను విధించే శిక్ష ఇదే జీవుడికి.

  కాబట్టి రాముడు చూచారా తండ్రి నెంతగా దూషించాడో అని కాదు మనం చూడవలసింది. తండ్రి ఏమిటి తల్లి ఏమిటి పరమాత్మకు. ఎవరైనా తప్పుచేస్తే దూషించవలసిందే. శిక్షించవలసిందే. అయినా మానవోచితంగా కూడా వ్యవహరించ వలసినవాడు కాబట్టి తండ్రిగా నలుగురిలో బయటపెట్టక ఆయన మర్యాద దక్కించాడు. జీవుడుగా తన వనగమన చర్యవల్ల శిక్షించాడు. ఎందుకు శిక్ష విధించాడో తెలపటం కోసం లక్ష్మణుడితో ఒక్కడితో మాత్రం బయటపడి అన్నాడు. అలా అనటంలో కూడా కామైక పరత్వ మనేది ముప్పు తెస్తుంది. ఎవరి జీవితానికైనా-కబర్దారని లోకానికి భంగ్యంతరంగా చాటటానికేనని అర్ధం చేసుకుంటే చాలు. ఇక ఆక్షేపణ చేయబోము మనం.

Page 68