#


Index

  తీసింది. అతడు వచ్చి రాముడితో మొరపెట్టాడు. వెంటనే ఖడ్గం చేత పట్టాడు రాముడు. పుష్పక మెక్కి రాజ్యం నలుదిశలా అన్వేషించాడు. శూద్రతపస్వి కంటపడ్డాడు. వాడికంఠ మాఖడ్గంతో కరుక్కున త్రెంచాడు. వెంటనే ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. అదీ ధర్మపాలనమంటే. పోతే లక్ష్మణుణ్ణి చంపట మిష్టంలేక దేశ బహిష్కృతుణ్ణి చేయటం కూడా ఆయన రాజధర్మ పాలనకొక కఠినమైన పరీక్షే. ఈ విధంగా చెబుతూ పోతే ఎంతైనా ఉంది. మొత్తం మీద రాముడి ధర్మపాలన అనన్యాదృశమైనది. లోకోత్తరమైనది. శిష్య ధర్మం దగ్గర నుంచి రాజధర్మం వరకూ దాని విరాడ్రూపాన్ని దర్శించవచ్చు ఆయన జీవితంలో. ధర్మమే రాముడు రాముడే ధర్మమన్నంతగా ధర్మాన్ని పాటించిన పాలించిన మహాను భావుడాయన.

★★★





Page 64