#


Index

  అమ్మా అలాంటి వీరపత్ని నీవనవలసిన మాటే నంటాడు హనుమంతుడు. ఇలాంటదే మరొక సన్నివేశం యుద్ధానంతరం ఏర్పడుతుంది. రావణ వధానంతరం సీతను తీసుకు రమ్మని హనుమంతుణ్ణి పంపుతాడు రాముడు. ఆవిడ తన ఎదుటికి రాగానే ఇలా అంటాడు. దైవికంగా వచ్చిపడిన ఉపద్రవాన్ని మానుషమైన బల పరాక్రమాలతో నేను త్రిప్పికొట్టాను. ఇది నీ కోసం కాదు. నా పౌరుషాన్ని నిలబెట్టటం కోసం. దీని మూలంగా నాకు కలిగిన అవమానం నా శత్రువుతోపాటే అంతమయింది. నా మనసు తేలిక పడ్డది. రాముడి వీరగుణానికిది ఒక విధంగా పరాకాష్ఠ. అంతేకాదు. ఉత్తరకాండలో రావణుడి గుణగుణాలను ప్రశంసిస్తూ మహర్షుల వల్ల అతని పూర్వ చరిత్ర వినగోరటంలో సాటి వీరుల యెడ ఆయనకు గల అభినందనగుణం కూడా తేటపడుతుంది.

  పోతే ఇక ఆఖరిది రాజధర్మం. ఇది మనకు రామాయణోత్తర భాగంలో బ్రహ్మాండంగా వ్యక్తవుతుంది. రామరాజ్యమని పేరు. ఏ ఆదర్శరాజ్యానికైనా అప్పటికీ ఇప్పటికీ ఆ మాట సార్థకం. అసలు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ రాజ లక్షణాలకు కూడా ఆయనతో పాటే వయసు పెరుగుతూ వచ్చింది. దశరథుడది గమనించే ఆయనకు యౌవ రాజ్యాభిషేకం చేయాలని చూచాడు. ప్రజాభిప్రాయం అడిగాడు. వారందరూ ఏకగ్రీవంగా అందుకను మోదించారు. రాముడిలో ఉండే గుణగుణా లెంతగానో వక్కాణించి చివరకు అయనను మించిన రాజు మరొకడుండ బోడని తీర్మానించారు. దశరథుడు మరలా రాముని పిలవనంపి మాట్లాడుతూ అద్య ప్రకృతయ స్సర్వాః త్వా మిచ్ఛంతి నరాధిపమ్- అతస్త్వామ్ యువరాజాన మభిషేక్ష్యామి అంటాడు. ప్రజలందరూ నిరపవాదంగా ఎవరిని కోరుతారో వాడే రాజు నిజానికి. వంశ పారంపర్యంగా సంక్రమించిందీ నిరంకుశంగా చేజి క్కించుకున్నదీ అది రాజ్యమూ కాదు. వాడు రాజూకాదు. తాత్కాలికంగా పైకి వచ్చినా నిలిచేది కాదది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థ ఇప్పటిది కాదు.

Page 61