సప్తసాలాలను నిర్మూలించాడు. బలశాలి అయిన వాలిని ఒక్క కోలతో కూలనేశాడు. దారివ్వని సాగరాన్ని పూరి గరిపించాడు. ఇంత చేసిన మహావీరుడుకి సంగ్రామ రంగంలో విజృంభించట మిక అసంభవమా. రావణుడు కాదు. శతసహస్ర రావణులైనా విద్రావణం చిత్తగించవలసిందే. కోపమే రాదు రాఘవుడికి. వచ్చిందో రాముడు కాడు. మహోద్దాముడే. శాత్రవ విరాముడే. కస్యబిభ్యతి దేవాశ్చ-జాతరోషస్య సంయుగే-రోషావిష్ణుడైడే త్రివిష్టప వాసులైనా చీకాకు పడి కాందిశీకులు కాక తప్పదు. అసలే రావణుడు. లోకవిద్రావణుడు. పితామహ వరగర్వితుడు. సమస్తలోక చర్వితుడు. దశాననుడు విపక్షమృగ శిక్షాదక్షపంచాననుడు. అనన్యసాధ్యుడు మానవులచేత వధ్యుడు. అలాంటి వాణ్ణి సామాన్య మానవ రూపంలో వచ్చి ఎదిరించి నిలవటమంటే ఎంత అసామాన్య వీరలక్షణమది.
విభీషణుడు శరణాగతుడయి వచ్చినప్పుడితడు శత్రుపక్షంవాడు. ఛద్మ బుద్ధితో మన దగ్గరకు వచ్చాడు ఇతణ్ణి చేరదీస్తే తమకేదో ముప్పు తెచ్చి పెట్టటం ఖాయ మితణ్ణి వదిలి వేయండని సుగ్రీవాదులు హెచ్చరిస్తారు రాముణ్ణి. అప్పుడు రాముడు మందహాసం చేసి వారితో ఇలా అంటాడు. సూక్ష్మమప్యహితం కర్తుమ్ - మమాశక్తః కథంచన నాకొకడు కీడు చేయటమనేది కలలోనివార్త. పిశాచాన్ దానవాన్ యక్షాన్ - పృధివ్యాంచన రాక్షసాన్ - అంగుళ్యగ్రేణతాన్ హన్యామిచ్చన్ హరిగణేశ్వర - దేవదానవ యక్షరాక్షసులెవరైనా సరే. నేను తలుచుకొన్నానంటే కొనగోటితో మీటి పారేయగలను. నన్ను శరణని వేడితే వాడు విభీషణుడేగాదు. రావణుడైనా సరే అభయ మిస్తాను. ఎంత ఉదాత్తమైన మాటో చూడండి. తలచుకొంటే ఎంతపనైనా చేయగలడట. ఇదుగో ఈ తలచుకోట మనే మాటల లో ఉంది మర్మమంతా. ఇంతపని చేయగలడా ఏమిటింత దీనంగా అమా యికంగా ఉన్నాడనిపిస్తుంది రామాయణంలో రాముడి వ్యవహారం మనకు. కాని సమయం వచ్చిందో ఇక ఆయనను పట్టపగ్గాలుండవు.
Page 58