#


Index

కవశ్యంగా ఉండలసిన వేమూడు లక్షణలూ. యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్య స్స మాధిమాన్ - అని మూడూ అలవడితేచాలు దిగంతవిశ్రాంత యశస్సంపన్ను డవుతాడు. దానికితోడు జ్ఞానమూ ఆ జ్ఞానానికి తగిన శుచిత్వము కూడా ఉంటే ఇక చెప్పనే అక్కరలేదు. శుచిత్వమంటే ఆర్జవం లేదా నిజాయితీ. అదే ఒక వశీకరణ విద్యలాగా పనిచేస్తుంది లోకంలో. దానితో సర్వలోక ప్రియస్సాధుః- సకల జన ప్రియం భావుకుడని పేరు గడిస్తాడు. అంతమాత్రాన చవట పిఱికి అయితే మరలా సుఖంలేదు. అది అశక్తత క్రిందికి వస్తుంది. కాలాగ్ని సదృశః క్రోధే - క్షమయా పృధివీసమః సమయానుగుణంగా నిగ్రహానుగ్రహాలు ప్రదర్శిస్తుండాలి మరలా. సమద్రంలాంటి గాంభీర్యమూ హిమాలయంలాంటి ధైర్యగుణమూ-వైశ్రవణునివంటి త్యాగబుద్దీ - సర్వసమత్వం - ఇలాంటి ఆర్యగుణ సంపత్తి అంతా అలవడి ఉండాలి. ఇవన్నీ పుడికి పుచుకొన్న వాడొకడే ఉన్నాడు లోకంలో. వాడే రాముంటాడు నారదుడు.

  నారదుడీ లక్షణాలన్నీ ఏకరువు పెట్టాడంటే ఆసలా లక్షణాలను గూర్చి ప్రశ్నించినవాడు వాల్మీకే. ఆయన ప్రశ్నిస్తేనే ఈయనగారీ వర్ణన చేసింది. వాల్మీకి నారదుణ్ణి అడిగిన మహాపురుష లక్షణాలు పదహారు. కోస్వస్మిన్ సాంప్రతంలోకే - గుణవాన్ కశ్చవీర్యవాన్ - అని ఆరంభించి కన్య బిభ్యతి దేవాశ్చ - జాతరోషస్య సంయుగే - అనే వరకూ ఈ గుణాలుగల మహానుభావుడెవరో చెప్పమని కోరుతాడు. ముక్తసరిగా పేర్కొన్న ఈ పదహారు గుణాలకూ వ్యాఖ్యానమే తరువాత నారటు డేకరువు పెట్టిన గుణాలన్నీ. ఇవన్నీ ఏదో ప్రస్తావవశంగా చెప్పినవికావు. అన్నీ రామాయణ కథా భాగంలో అక్కడక్కడా మనకు దాఖలా అయ్యేవే. ధర్మజ్ఞత అనేది సరేసరి. ఇదివృత్తమంతా పనగలిసి ఉందనుకోండి. కృతజ్ఞత అనేది జటాయువు కంత్యసంస్కారాదులు చేయటంలో - హనుమదాది వానరులను సవిశేషంగా సత్కరించటంలో కనిపిస్తుంది మనకు. మరి సత్యవాక్య మనేది

Page 36