#


Index

  పాలకుడే. పాపం ఏదోశాపం కారణంగా వచ్చి పడ్డాడీ లోకంలో. తనతో శత్రుత్వం వాడు నటిస్తే తానూ నటించాడు. చివరకు తన వల్లనే శాపమోక్షమై వెళ్లిపోయాడు వాడు. తీగకదిలిస్తే డొంకకదిలినట్టు అతడి చరిత్ర లోతుకుదిగితే అది మరొక విధంగా తన చరిత్రే అయినా ఆశ్చర్యంలేదు. అయిందికూడా. వాడు కైలాసంలో నందితో కలహించి శాపంపాలయ్యాడన్నా తనవంశీయుడైన అనరణ్యుడి శాపానికి గురి అయ్యాడన్నా - కడకు వేదవతిని బలాత్కరించబోయి యోగానల దగ్ధ అయిన ఆవిడచేత శాపం నెత్తికి తెచ్చుకొన్నాడన్నా - రంభా కామసంరంభంలో నల కూబరుడిచేత, శప్తుడయ్యాడన్నా - అదంతా అతణ్ణి వధించటానికి తాను అవతరించక తప్పదనే రహస్యం చెప్పటానికే. దానికోసం ఒక పూర్వరంగాన్ని సిద్ధం చేయటానికే కాకపోతే మరెందుకీ ప్రస్తావన అంతా. ఇంకా తడవి చూస్తే రావణుడు వాలిచేతిలో పరాభవం పాలు కావటం - కార్తవీర్యుడి చేతిలో అవమానితుడు కావటం - ఇవికూడా భంగ్యంతరంగా రాముడి లోకోత్తర పరాక్రమాన్నీ - లోకోత్తరమైన ఆయన అవతారతత్త్వాన్ని చాటి చెప్పటమే. ఆ వాలి నొక్క బాణంతో అవలీలగా వధించాడు. ఆ కార్తవీర్యుడి వేయిచేతులూ నరికిన పరశురాముణ్ణి బాణమింకా విడవకుండానే నిర్వీర్యుణి చేశాడాయె తాను. ఇక వాలిచేతిలో ఓడిపోయిన రావణుణ్ణి జయించట మేమి ఆశ్చర్యం. అదే ఆశ్చర్యం కాకపోతే శ్వేతద్వీప నివాసినులైన విలాసినుల చేతిలో చిక్కి ఒక బక్క కోతిలాగా ఉక్కిరి బిక్కిరి అయిన రావణుడికి తాను విద్రావణుడు కావటమొక ఆశ్చర్యమా. ఆ శ్వేతద్వీప మెవరిది. క్షీరసాగరశాయి అయిన తనదేగదా. ఆ విలాసినులెవరు. తన సహవాసినులే గదా. అంచేత పూర్వవృత్తాంత కథనవ్యాజంతో అగస్త్యుడు జ్ఞాపకం చేస్తే - తచ్ఛవణవ్యాజంతో తనవైభవం తానే స్మరిస్తూ సంతసించటమే ఇదంతా. చుట్టూ ఉన్న హనుమదాదులను సంతసింపజేయటమే. కడపట లోకాపవాదమనే పేరుతో సీతను పరిత్యజించటమూ - ప్రతిజ్ఞ అనే మిషతో

Page 31