ఆయనగారే సూచిస్తాడు ఫలానా చోట అని. తరువాత మరొక విశేషమేమంటే ధర్మభృదాదులైన ఋషలెవరు తనకు తటస్థపడినా ఆగస్త్యులవారి ఆశ్రమమెక్కడ వారిని చూడాలని అడుగుతూ పోతాడు రాముడు. మనోరథో మహానేష - హృదిమేపరివర్తతే. ఎంతో కుతూహలంగా ఉందట తన కాయనను చూడాలని. దీనికంతా ఒక గూఢమైన కారణమున్నది. అది అగస్త్యుడి దగ్గర బయటపడుతుంది. ఆ మహర్షి చాలామంది క్రూరరాక్షసులను వధించినవాడని సుతీక్షాదులు చెబుతారు. తన కర్తవ్యమూ అదే రాముడికి. అంతేకాదు. ఆయన దగ్గర తనకు కావలసిన అస్త్రశస్త్రాదు లెన్నో ఉన్నాయి. అవన్నీ రాముడి కప్పగిస్తాడాయన. ఇదమ్ దివ్యమ్ మహచ్ఛాపమ్ - హేమరత్నవి భూషితమ్ - వైష్ణవం పురుషవ్యాఘ్ర - నిర్మితం విశ్వకర్మణా - అమోఘస్సూర్య సంకాశో - బ్రహ్మదత్తశ్శరోత్తమః దత్తామామ మహేంద్రేణ - తుణీచాక్షయ సాయకే. మహారజత కోశోయమసిః ఇవిగో వైష్ణవమైన ధనుస్సు - బ్రహ్మదత్తశరం అక్షయబాణతూణీరాలు - ప్రచండమైన ఖడ్గం అనేన ధనుషా రామహత్వాసంఖ్యే మహాసురాన్ ఆజహారశ్రియం దీప్తాం - పురావిష్ణు ర్ధివౌకసామ్ జయాయ ప్రతిగృహ్లిష్వ ఈ ధను ర్భాణాదులతో పూర్వం విష్ణుదేవుడు రాక్షస సంహారం చేసి దేవతలకు వారి స్వర్గరాజ్యాన్ని మరలా తెచ్చి ఇచ్చాడు. నీకు కూడా విజయం కలగాలని వీటిని నీకర్పిస్తున్నాను. స్వీకరించమని ఇస్తాడు. రాముడు మాటాడకుండా ఇచ్చిందే తడవుగా ప్రతిగ్రహిస్తాడు. ఏమిటీ వ్యవహారం, ఆగస్త్యుణ్ణి చూడాలనుకొన్న దిందుకా 'తాను. శరభంగ సుతీక్షాదులను దర్శిస్తూ వారిని వీరినడుగుతూ రావటమిందుకే నన్నమాట. తన పూర్వాయుం, సామగ్రిని మరలా పరిగ్రహించటానికే. అవి ఆగస్త్యుడి దగ్గర న్యాసమున్నాయని తెలుసు ఆయనకు. తనకోసమే ఆయన దాచాడనీ తెలుసు. తనకోసం కాకపోతే ఆ ముసలాయనకు వాటితో ఏమి పని. పైగా విష్ణువు పూర్వం వాటితోనే
Page 24