#


Index

- ద్రష్టవ్యో మత్ప్రవాసనే - రాజ్య స్యచ వితీర్ణస్య - పునరేవనివర్తనే కైకేయ్యాః ప్రతిపత్తి - కథంస్యా న్మమపీడనే - యది భావోన దైవోయమ్ - కృతాంతవిహితో భవేత్ - కథమ్ - ప్రకృతి సంపన్నా - రాజపుత్రీ హ్యనిందితా - ఉన్నత వంశంలో పుట్టి నన్నింత వాత్సల్యంతో చూచే మా తల్లికైక ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే ఇదికేవలం దైవప్రేరణేగాని ఆమె అపరాధం కాదు. మరొక కారణం కాదు అంటాడు. ఈ దైవమెవరో గాదు. తానే. తన్ను గూర్చి తానే వ్యంగ్యంగా సూచిస్తున్నాడు అంతేకాదు. తరువాత వల్కల ధారణ మొదలుకొని వన ప్రస్థానం వరకూ ఎన్ని విషయాలు జరుగుతున్నా ఎవరెన్ని దీనా లాపాలు చేస్తున్నా అందరూ కలిసి కైక నెంతగా ఆడిపోసు కొంటున్నా - ఒక్క మాట అయినా మాటాడక మౌనంగా పట్టణాన్ని దాటి వెళ్లిపోవటమింకా గంభీరమైన విషయం.

  తరువాత భాగీరథీ తీరంలో గుహుణ్ణి కలుసుకొన్నాడు రాముడు. భరద్వాజుడ్జీ కలుసుకొన్నాడు. ఇద్దరూ తనకు పూర్వ పరిచితులే. ఇద్దరికీ తెలుసు ఆయన పట్ట భంగమై అక్కడికి వచ్చాడని. అయ్యో ఇలా జరిగిందని మాకు తెలుసు నంటారేగాని అంతకుమించి దాన్ని వ్యాఖ్యానించరు వారు. రాముడు దాన్ని గూర్చి ప్రస్తావించడు. ఒక్క భరతుడు వచ్చి తన్ను తిరిగి రమ్మని బలవంతం చేసినప్పుడే కొంత దీర్ఘంగా చర్చ జరిగింది. అక్కడ ఒక విశేషమేమంటే భరతుడెంత బ్రతిమాలుతున్నా వాటి కొక్కటే జవాబిస్తాడు రాముడు. సమయా శాసనం తస్యత్యక్తుమ్ న్యాయ్య మరిందమ తత్త్వయాపిసదా మాన్యమ్ - ఋణాన్మోచయ రాజానమ్ మత్కృతే నాకు గాని నీకు గాని తండ్రిగారి శాసన ముల్లంఘించటం ధర్మంకాదు. ఆయనను నీవు ఋణవిముక్తుణ్ణి చేయాలంటాడు. ఋణమేమిటి - విమోచన మేమిటని ఆశ్చర్యం వేస్తుంది మనకు. అది ఒక రహస్యం. రాజరహస్యం. తప్పనిసరి అయి బయట పెడతాడు రాముడు. పురాభ్రాతః పితానస్స మాతరంతే సముద్వహన్ మాతామహేసమాశ్రాషీ - ద్రాజ్యశుల్క

Page 21